హరిహర వీరమల్లు రిలీజ్‌కి నెలరోజులు – బజ్ పెరగక ఆందోళన

Share


అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు హరిహర వీరమల్లు మూవీని మే 9న విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు ప్రకటిస్తున్నా, ఇప్పటికీ ప్రమోషన్లు మామూలుగా ఉండటం పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు ఆశించిన స్థాయిలో బజ్ రాకపోవడమే కాదు, విడుదల తేదీ సమీపిస్తోన్నా ఫుల్ ఫ్లెజ్డ్ ప్రచారం మొదలవలేదు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు కూడా అభిమానులను పూర్తిగా మెప్పించలేకపోయాయి. తాజాగా “పెద్ది” గ్లింప్స్ ఎంత హైప్ క్రియేట్ చేశాయో చూసిన తర్వాత పవన్ ఫ్యాన్స్ కూడా అలాంటి స్ధాయి ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ నిర్మాతలవైపు నుంచి అలాంటి సిగ్నల్స్ ఇంకా రావడం లేదు. పవన్ ఒకసారి నాలుగైదు రోజులు డేట్లు ఇస్తే షూటింగ్ పూర్తవుతుందని ఓ లీక్ వినిపించినా, అధికారికంగా ఎలాంటి అప్‌డేట్ లేదు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అరకు పర్యటనలో ఉండగా, త్వరలో అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. మంత్రివర్గ సమావేశాలు, జనసేన సమీక్షలతో పాటు రాజకీయ వ్యস্তతలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ షూటింగ్ డేట్లు ఇవ్వడం అంత సులభం కాదనడంలో ఆశ్చర్యం లేదు.

ఇంకా డబ్బింగ్ పనులు మిగిలి ఉన్నాయి. సెన్సార్‌కు వెళ్ళాలి. మే 9కి కేవలం నెలరోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అంతలోనే అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్రచార కార్యక్రమాలు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, ఇతర నగరాల్లో ప్రమోషన్లు నిర్వహించాల్సి ఉంటుంది. పవన్ ప్రమోషన్లలో పాల్గొనడం కష్టమే కాబట్టి, మిగిలిన నటీనటులతో సినిమా పట్ల బజ్ పెంచే పని నిర్మాతలకు సవాలుగా మారింది.


Recent Random Post: