
ప్రాంతీయంగా గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీలు దేశవ్యాప్తంగా, ఆ తర్వాత గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ ట్రెండ్‌లో సౌత్ స్టార్‌లు బాలీవుడ్‌లో సత్తా చాటే ప్రయత్నాలు చేస్తుంటే, బాలీవుడ్ నటీమణులు హాలీవుడ్‌లో స్టార్‌గా స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి ప్రముఖుల్లో ముందుగా ప్రియాంక చోప్రా పేరు గుర్తించాలి.
సౌత్ ఇండస్ట్రీ నుంచి తన కెరీర్ ప్రారంభించి, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ హోదాను పొందిన తర్వాత, ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో కూడా గ్లోబల్ ఇమేజ్ సాధిస్తూ ఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలిచారు. 8 సంవత్సరాల క్రితం బాలీవుడ్ వదిలి హాలీవుడ్‌కు వెళ్లిన ఈమె, అక్కడ పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో నటించి తన ప్రతిభను సిద్దం చేసుకున్నారు. హాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన ప్రియాంక, అంతర్జాతీయ వేడుకల్లో పాల్గొనడం, పెద్ద బడ్జెట్ చిత్రాల్లో 50 కోట్ల పైగా రెమ్యూనరేషన్ పొందడం ద్వారా గ్లోబల్ స్థాయి గుర్తింపు సాధించారు. ప్రస్తుతం తెలుగులో Priyanka Chopra Jonas రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “వారాణాసి” సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ప్రియాంక తర్వాత దీపికా పదుకొనే కూడా హాలీవుడ్‌లో అవకాశాలను అన్వేషిస్తూ, అంతర్జాతీయ వేడుకల్లో సందడి చేస్తున్నారు. ఆస్కార్ ఈవెంట్లో ఇండియా తరఫున మాట్లాడి మరింత ప్రాచుర్యం పొందిన ఈమె, గ్లోబల్ ప్రొఫైల్ నిర్మించుకునే ప్రయత్నంలో ముందడుగు వేస్తున్నారు.
ఇక అలియా భట్ కూడా హాలీవుడ్‌లో గుర్తింపు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమాలో గాల్ గాడోట్‌తో నటించినప్పటికీ, సినిమా ప్రపంచవ్యాప్తంగా పెద్దగా హిట్ కాలేదు. ఫలితంగా, అలియా అంతర్జాతీయ గుర్తింపు పొందడం కష్టతరం అవుతోంది. రెడ్ కార్పెట్, మెటాగాలా ఫ్యాషన్ వీక్, బాఫ్టా వేడుకల్లో పాల్గొంటూ తన ఉనికిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, గ్లోబల్ గుర్తింపు ఇంకా సాధించలేకపోతోంది. ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్టులు కూడా ఆమె చేతుల్లో లేవు.
ఇలాంటి పరిస్థితుల్లో, అలియా భట్ ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనేల దారిలోనే హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ కలలు సాకారం కావడానికి ఇంకా సమయం పట్టనుందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో గ్లోబల్ మార్కెట్లో తన ఉనికిని ఎలా చాటుకుంటుందో చూడాలి.
Recent Random Post:















