హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన కంగనా రనౌత్

Share


నేషనల్ అవార్డు విజేత కంగనా రనౌత్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో గుణాత్మక సినిమాల ద్వారా నటి‌గా త‌న‌ స్థాయిని నిరూపించుకున్న కంగనా నుంచి ఇటీవల బాక్సాఫీస్ హిట్ సినిమాలు రాలేదు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించిన ఎమర్జెన్సీ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నా, సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చినా, కమర్షియల్‌గా అది ఆశించిన స్థాయికి చేరలేదు. ఆ తర్వాత కంగనా నుంచి కొత్త సినిమా రాలేదు.

ఇప్పుడు, కంగనా రనౌత్ హాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. Blessed Be The Evil అనే హారర్ డ్రామా సినిమాతో ఆమె ఇంటర్నేషనల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో కంగనా, Teen Wolf ఫేమ్ టైలర్ పోజీ, స్కార్లెట్ రోజ్ స్టాలోన్లతో కలిసి స్క్రీన్‌ను షేర్ చేయనున్నారు.

లయన్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి, టైలింగ్ పాండ్, న్యూ మీ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అనురాగ్ రుద్ర దర్శకత్వం వహించనున్నారు. సినిమా షూటింగ్ ఈ వేసవిలో న్యూయార్క్లో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్‌లో పలు దేశాల టాప్ టెక్నీషియన్లు భాగమవుతారని తెలుస్తోంది.

ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న కంగనా, బాలీవుడ్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, తాజాగా ఏ సినిమా కూడా ఆమె ఓకే చేయలేదు. అయితే హాలీవుడ్ ప్రాజెక్టుతో ఆమె మళ్లీ లైమ్‌లైట్‌లోకి రానుందని అభిమానులు భావిస్తున్నారు.


Recent Random Post: