
సాంకేతిక, వ్యాపార, వినోద రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలంగాణ రాజధాని హైదరాబాద్ తన గ్లోబల్ హబ్ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తన కొత్త విస్తరణ ప్రణాళికను ప్రకటించింది.
భారత కార్యకలాపాల్లో భాగంగా, ముంబై తర్వాత దేశంలో రెండో అతిపెద్ద కేంద్రంగా నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌ను ఎంచుకుంది. హైటెక్ సిటీలోని క్యాపిటాలాండ్ ITPH బ్లాక్ Aలో 41,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కొత్త కార్యాలయం ఏర్పాటుకానుంది. ఇదే భవనంలో వార్నర్ బ్రదర్స్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థ కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
కొత్త కేంద్రం ముఖ్యంగా దక్షిణ భారత మార్కెట్, ముఖ్యంగా తెలుగు కంటెంట్‌పై దృష్టి పెట్టనుంది. కంటెంట్ తయారీ, పోస్ట్ ప్రొడక్షన్, టెక్నికల్ సపోర్ట్, ఆపరేషన్స్ వంటి విభాగాలు ఇక్కడ ప్రధాన పాత్ర పోషించనున్నాయి. “బాహుబలి”, “ఆర్ఆర్ఆర్” వంటి తెలుగు చిత్రాల ప్రపంచ స్థాయి విజయంతో తెలుగు క్రియేటివ్ ఇండస్ట్రీపై నెట్‌ఫ్లిక్స్ దృష్టి మరింతగా పెరిగినట్లు తెలుస్తోంది.
గత దశాబ్దంలో హైదరాబాద్ సినిమా, మీడియా, యానిమేషన్, VFX రంగాల్లో భారీ స్థాయిలో అభివృద్ధి సాధించింది. ప్రభుత్వం చేపట్టిన IMAGE టవర్స్ వంటి ప్రాజెక్టులు నగరాన్ని డిజిటల్ మీడియా, కంటెంట్ ఉత్పత్తి హబ్‌గా వేగంగా ఎదగడానికి తోడ్పడుతున్నాయి. ఈ నేపథ్యంతో అంతర్జాతీయ సంస్థల రాక నిరంతరం పెరుగుతోంది.
Recent Random Post:















