
పుష్ప 2తో పాన్ ఇండియా స్థాయిలో తన క్రేజ్‌ను మరింతగా పెంచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అట్లీతో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతుండగా, కాస్టింగ్ నుంచి టెక్నికల్ వర్క్ వరకు ఎక్కడా రాజీ పడకుండా మేకర్స్ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె బన్నీ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా, తమిళ కమెడియన్ యోగి బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. భారీ స్థాయిలో విజువల్స్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దింపడం విశేషం. అంతేకాకుండా, కొన్ని అంతర్జాతీయ స్టూడియోలు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర యానిమేటెడ్ వెర్షన్‌లో కూడా కనిపించనున్నారని టాక్ ఉంది. AA22xA6 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 50 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. అట్లీ ప్లాన్ చేసిన దానికంటే వేగంగా సినిమా ముందుకు తీసుకెళ్తున్నారని ఇండస్ట్రీ టాక్.
రొటీన్ జానర్లకు భిన్నంగా, ఈ సినిమాను ప్యూర్ పాన్-వరల్డ్ అప్పీల్ కలిగిన కంటెంట్‌తో ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కలానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండగా, 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Recent Random Post:














