అట్లీ డైరెక్షన్‌లో డ్యూయల్ రోల్?

Share


పాన్ ఇండియా సెన్సేషన్ ‘పుష్ప 2: ది రూల్’ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమా పట్ల ఆసక్తి తారాస్థాయిలో ఉంది. ఎట్టకేలకు బన్నీ నెక్ట్స్ సినిమా పై క్లారిటీ రాబోతుంది. ఏప్రిల్ 8, అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన అధికారిక అనౌన్స్‌మెంట్‌ రానుంది.

ఇది ఓ వీడియో రూపంలో ఉండబోతోంది. ఇందులో బన్నీ, అట్లీతో పాటు సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ పాల్గొన్న డిస్కషన్ షాట్లు, అలాగే అమెరికాలో ప్రముఖ స్టూడియో వీఎఫ్ఎక్స్ నిపుణులతో జరిగిన మీటింగ్స్‌ను కూడా చూపించనున్నారు. వీటికి తోడు ఊహించని సంభాషణలు, కిక్ ఇచ్చే విజువల్స్ ఈ ప్రోమోలో ఉంటాయని మాకందిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం.

ఈ సినిమా జానర్ గురించి ఇంకా బయటకి స్పష్టత రాలేదు కానీ, లీకైన సమాచారం మేరకు బన్నీ తన కెరీర్‌లో తొలిసారిగా డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. రెండు పాత్రలూ పూర్తిగా భిన్నమైన షేడ్స్‌తో ఉండనున్నాయట. ‘జవాన్’లో షారుఖ్‌ చేసిన మ్యాజిక్‌లా, బన్నీ పాత్రలలోనూ అట్లీ డైరెక్షన్ అదరగొట్టే విధంగా ఉంటుందని టాక్.

ఇంకా ఆసక్తికరమైన విషయమేమంటే, ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటించబోతున్నారన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై వీడియోలో స్పష్టత వస్తుందా లేదా అనేది చూడాలి. ప్యాన్ ఇండియా రేంజ్‌లో బన్నీ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, అన్ని భాషల ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ప్రోమోను డిజైన్ చేశారట.

విడుదల తేదీ గురించి కూడా కొన్ని సూచనలు ప్రోమోలో ఉండబోతున్నాయని, బన్నీ క్యాంప్ నుంచి చర్చలున్నాయి. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కానీ, డబ్‌యూ లో ఇద్దరూ కలిసి దీన్ని ఎప్పటి వరకు కంప్లీట్ చేయాలన్నది క్లియర్ ప్లాన్ చేసుకున్నారట. అంతేకాదు, గీతా ఆర్ట్స్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటుందన్న చర్చలు ఉన్నాయి.

2026 విడుదలను టార్గెట్ చేసుకున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ బన్నీ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని అభిమానుల నమ్మకం. అనౌన్స్‌మెంట్ ప్రోమోలో బన్నీ మార్క్ హాస్యం, ఫన్నీ పంచ్‌లు కూడా ఉండబోతున్నాయట. ఇంకా కేవలం 48 గంటల లోపే ఈ సస్పెన్స్ వీడబోతుంది!


Recent Random Post: