అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీపై రూమర్లకు ఫుల్ స్టాప్!

Share


సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ Anil Ravipudi నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన, ప్రేక్షకులకు కావాల్సిన పక్కా ఎంటర్టైన్మెంట్ అందిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. డెబ్యూ మూవీ Pataas తో సూపర్ హిట్ అందుకున్న అనిల్, ఆ తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్నారు.

గతేడాది విక్టరీ వెంకటేష్‌తో కలిసి చేసిన Sankranthiki Vasthunnam భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా మెగాస్టార్ **Chiranjeevi**తో కలిసి చేసిన Mana Shankara Vara Prasad Garu కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా ఈ సినిమా దూసుకుపోతోంది.

ఈ సక్సెస్ తర్వాత అనిల్ రావిపూడి తదుపరి సినిమా ఏది? అనే ప్రశ్న ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి వెంకటేష్‌తోనే సినిమా చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హీరోయిన్లు, టైటిల్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అన్నీ ఫిక్స్ అయ్యాయంటూ ప్రచారం జరిగింది.

ఇప్పటికే ఈ రూమర్లపై స్పందించిన అనిల్, తాజాగా Couple Friendly ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మరోసారి ఆసక్తికరంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో హీరో Santosh Sobhan నెక్స్ట్ మూవీపై అప్డేట్ ఇవ్వాలని అడగగా, అనిల్ నవ్వుతూ స్పందించారు.

“నిజం చెబుతున్నా… హానెస్ట్‌గా చెబుతున్నా… స్క్రిప్ట్‌పై ఒట్టు వేసి చెబుతున్నా… నా దగ్గర కంటే కొందరు ట్విట్టర్ జర్నలిస్టుల దగ్గరే నా కథ ఉంది. నేను కూడా చూస్తున్నాను. మీ ఫోన్ ఓపెన్ చేసి వారిలో ఎవరికి ఫోన్ చేసినా పూర్తి డిటైల్స్ చెబుతారు” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలతో ఈవెంట్‌లో నవ్వులు పూశాయి. ఇటీవల తాను ఇంకా కాగితం మీద కలం కూడా పెట్టలేదని, కానీ సోషల్ మీడియాలో అప్పుడే కథ, క్యాస్టింగ్, టైటిల్ అన్నీ ఫిక్స్ అయిపోయాయని పోస్ట్ చేసిన ఆయన… “ఈ ఫ్లో చూస్తుంటే యాక్షన్, కట్ కూడా వాళ్లే చెప్పేస్తారేమో” అంటూ హాస్యంగా స్పందించారు.


Recent Random Post: