
అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు అ..ఆ చిత్రంతో పరిచయం అయ్యారు. తక్కువ కాలంలోనే తన ప్రత్యేకతను చాటుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కార్తికేయ 2 తర్వాత కచ్చితమైన సినిమాలను ఎంపిక చేసుకొని అనుపమ తన సక్సెస్ రూట్‌ను కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా టిల్లూ స్వ్కేర్ ద్వారా ఆమె సూపర్ హిట్ అందుకుని క్రేజ్ మరింత పెరిగింది.
తాజాగా, పరదా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనుపమపై అభిమానులు పెద్ద ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ సినిమా వారి ఆశలకు తగ్గ స్థాయిలోనే ఫలితమిచ్చింది. ఇప్పుడు అనుపమ కొత్త సినిమా కిష్కిందపురితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ ఫీమెల్ లీడ్‌గా కనిపిస్తున్నారు.
కౌశిక్ పెగిళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కిష్కిందపురి సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించింది. ట్రైలర్ రిలీజ్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఈ సినిమాలో అనుపమ దెయ్యంగా కనిపించనుందని ట్రైలర్ చూశాక స్పష్టమైంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనుపమ చెప్పారు, “తన తల్లి రోజూ నిద్రలేవగానే నన్ను దెయ్యంలా అని చెప్పేవారు. అందుకే ఘోస్ట్ కథలో నటించమని అడిగితే, సంతోషంగా ఓకే చెప్పానని” అన్నారు. అలాగే, కౌశిక్ కథ చెప్పినప్పుడు కథలో ఆసక్తి పడ్డానని, ఆరోగ్యం బాగలేదైనా సినిమా కోసం ఓపిక చూపించారని తెలిపారు.
Recent Random Post:














