అనుష్క ఘాటి సెప్టెంబర్ 5న రిలీజ్

Share


ఇద్దేళ్ల గ్యాప్‌ తర్వాత స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా “ఘాటి”. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీని యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కోసం సిద్దమవుతోంది.

అయితే సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా కూడా అనుష్క ప్రమోషన్స్‌లో కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటివరకు డైరెక్టర్ క్రిష్ మాత్రమే బిగ్ బాస్ అగ్నిపరీక్ష స్టేజ్‌పై సినిమాను ప్రమోట్ చేశారు. అనుష్క ఎక్కడా పాల్గొనకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం సినిమా ప్రపంచంలో స్టార్ సినిమాలు కూడా సరైన ప్రమోషన్స్ లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టం. ఈ పరిస్థితిలో “ఘాటి” ప్రమోషన్స్ లేకుండా బజ్ సృష్టించడం ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.

అనుష్క చివరిసారిగా “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” సినిమాలో నటించింది. ఆ తర్వాత చేసిన సినిమా ఇదే. అనుష్క-క్రిష్ కాంబినేషన్‌లో ఇదే రెండో సినిమా. ఇంతకు ముందు “వేదం”లో సరోజ్ పాత్రతో ఆమె ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు మళ్లీ “ఘాటి”లో తన నటనతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు క్రిష్ కూడా పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చి పూర్తి శ్రద్ధతో ఈ సినిమాను తీశారు.

సెప్టెంబర్ 5న “ఘాటి” వర్సెస్ “మిరాయ్” క్లాష్ జరగనుంది. తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన “మిరాయ్” కూడా అదే రోజున విడుదల అవుతోంది. దీంతో ఈ బాక్సాఫీస్ పోటీపై సినీ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది.


Recent Random Post: