త రాత్రి జరిగిన “గేమ్ ఛేంజర్” ప్రీ-రిలోజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గురించి గొప్పగా మాట్లాడి, అభిమానుల హృదయాలను తాకారు. అది కేవలం ఇరవై నాలుగు గంటలు గడవక ముందే, మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్న మరో ఈవెంట్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది.
హైదరాబాద్ లో జరుగుతున్న ఆప్టా బిజినెస్ క్యాటలిస్ట్ కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి, ప్రసంగంలో ఒక అరుదైన జ్ఞాపకాన్ని పంచుకున్నారు. చాలా ఏళ్ల క్రితం, పవన్ కళ్యాణ్ తో చిరంజీవి ఒక ప్రత్యేకమైన మాట అన్నారు: “బాలీవుడ్ లో రాజ్ కపూర్ ఫ్యామిలీ ఒక లెగసీని సృష్టించి ఎంతో మంది స్టార్లను అందించినట్టుగా, తెలుగులో మన కుటుంబం కూడా ఆ స్థాయికి చేరుకోవాలి.”
చిరు ఆ మాట మరిచిపోయి ఉంటారని అనిపించినా, పవన్ మాత్రం దీన్ని గుండెల్లో పెట్టుకున్నారు. ప్రస్తుతం పవన్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నీహారిక ఇలా ప్రతి ఒక్కరూ తమ టాలెంట్ తో కుటుంబం ప్రతిష్ఠను పెంచుతున్నారు. ఇటీవలే, పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని చిరంజీవికి గుర్తు చేస్తూ, “మీరు కోరుకున్నది నెరవేరింది” అని ఆనందంగా చెప్పారు.
ఇంకా చిరు తన ప్రసంగంలో, ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ లో ప్రచురితమైన “కపూర్స్ ఆఫ్ సౌత్ ఇండియా” అనే ఆర్టికల్ ను ప్రస్తావించారు. ఈ సందర్భంలో చిరు తన తమ్ముడు పవన్ పేరును ఎత్తిన ప్రతిసారి, సభలో ఈలలు, కేకలు హోరెత్తడం అభిమానుల అభిమానం ఎలా ఉందో తెలియజేసింది.
ప్రస్తుతం చిరంజీవి తన తదుపరి సినిమా కోసం అనిల్ రావిపూడి స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఈ అన్నదమ్ముల బాండింగ్ ఏ ఈవెంట్ లోనైనా అభిమానుల హృదయాలను హత్తుతోంది. మెగా ఫ్యామిలీ అనుబంధం, ఫ్యాన్స్ కి మామూలు సంతోషం కాదని ఈ సంఘటనలు మరోసారి రుజువు చేశాయి.
Recent Random Post: