అమీర్ ఖాన్-రాజమౌళి మహాభారతం కలయికపై ఊహాగానాలు

Share


మహాభారతం సినిమాగా తీయాలన్న ఆసక్తి ఇండియాలో ఉన్నవారిలో ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి—బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, మరియు ద‌ర్శ‌క శిఖ‌రం ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. ఇప్పటికే వీరిద్దరూ వేర్వేరుగా మహాభారతాన్ని తీయాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, రాజ‌మౌళి ఈ విషయంలో చాలా స్లోగా ముందుకెళ్తుంటే, అమీర్ ఖాన్ మాత్రం పదేపదే అప్‌డేట్స్ ఇస్తూ తన ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెడుతున్నాడు.

ఇటీవ‌ల‌ అమీర్ ఖాన్ మాట్లాడుతూ, మహాభారతంలో శ్రీకృష్ణ పాత్రను తానే పోషించనున్నట్టు వెల్లడించారు. స్క్రిప్ట్ వర్క్ కూడా ప్రారంభమైందని చెప్పారు. కానీ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించేది ఎవరు? అన్న విషయం మాత్రం ఇంకా చెప్పలేదు.

బాలీవుడ్‌లోని టాప్ డైరెక్టర్లు ఈ అవకాశాన్ని ఆశగా ఎదురు చూస్తున్నా, అమీర్ వారిలో ఎవరికీ అవకాశం ఇస్తాడా అన్నది సందేహమే. ఎందుకంటే, అమీర్ ఖాన్ మనసంతా రాజ‌మౌళి మీదే ఉందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మహాభారతం లాంటి భారీ పాన్-ఇండియా సినిమా రాజ‌మౌళి తీస్తేనే న్యాయం చేయగలడు అనేది అమీర్ విశ్వాసం.

ఇతర సందర్భాల్లో కూడా అమీర్ ఖాన్ పలు మార్లు రాజ‌మౌళితో సినిమా చేయాలని తన ఆసక్తిని వ్యక్తపరిచాడు. “మీతో ఒక సినిమా చేయాలని ఉంది” అంటూ వినయంగా కోరినట్టు సమాచారం. ఇద్దరూ మంచి మిత్రులే. కానీ రాజ‌మౌళి మాత్రం ఇంకా బాలీవుడ్‌కు ఆ షిఫ్ట్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన తెలుగు హీరోలతోనే తన సినిమాలను ప్లాన్ చేస్తూ ముందుకెళ్తున్నారు.

ఇప్పుడు మళ్లీ మహాభారతం ప్రాజెక్ట్ చర్చలోకి రావడంతో, ఈ responsibility రాజ‌మౌళికే అప్పగించాలనే ఆలోచనతో అమీర్ పావులు కదిపే అవకాశం ఉంది. ఎందుకంటే అమీర్‌కు రాజ‌మౌళి టాలెంట్ మీద అసాధారణ నమ్మకం ఉంది. ఇక, రాజ‌మౌళి కూడా ఒకేసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతాన్ని చేసేందుకు అవకాశం రావడం వల్ల, ఈ కలయిక వర్కవుట్ అయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.


Recent Random Post: