అర్జున్ రెడ్డి బీహైండ్ ది సీన్స్: సందీప్ vs రధన్

Share


టాలీవుడ్ కల్ట్ బ్లాక్‌బస్టర్‌లలో అర్జున్ రెడ్డి ఒక మైలురాయి సినిమా. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, హీరో క్యారెక్టర్, బిహేవియర్, సినిమా రన్‌టైం, మాంటేజ్ పాటలు లాంటి అంశాలతో ఓ కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమా విజయ్ దేవరకొండకు ‘రౌడీ’ ఇమేజ్‌ను బలపరిచి, దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది. ఇక సంగీత పరంగా యువ సంగీత దర్శకుడు రధన్ అందించిన బీట్స్ ఇప్పటికీ శ్రోతలను అలరిస్తున్నాయి.

అయితే, ఈ విజయవంతమైన ప్రాజెక్ట్ వెనుక ఎన్నో కష్టాలున్నాయి. మేజారిటీగా మాంటేజ్ పాటలే ఉండటం వల్ల దర్శకుడు సందీప్ రెడ్డి షూటింగ్ సమయంలో గట్టి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. రధన్ నుంచి ట్యూన్స్ రావడం ఆలస్యం కావడం, సమయాన్ని ఇచ్చకపోవడం వంటివి తలనొప్పిగా మారాయి. చాలా సందర్భాల్లో “రధన్ చేసిన పనికి బూతులొస్తున్నాయి” అని కూడా సందీప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. “ట్యూన్ కావాలంటే నేను ఇచ్చింది తీసుకో, లేదా సినిమానే ఆపేస్తా” అని రధన్ బ్లాక్‌మెయిల్ చేశాడన్న విమర్శలు ఉన్నాయి.

అంతేకాకుండా చెన్నైకి వెళ్లినా రధన్ కలవడానికి టైం ఇవ్వలేదని, ఓ పురుగును చూసినట్టు చూస్తాడని వంగ చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన అనుభవం మొత్తం చూసుకుంటే రధన్ ఒక టార్చర్ అనిపించాడని అర్థమవుతుంది. ఇదే కాదు, సిద్ధార్థ్ రాయ్ అనే మరో డైరెక్టర్ కూడా రధన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఆశ్చర్యకరంగా, ఇటీవల రధన్ మాత్రం తన యాటిట్యూడ్‌కి వ్యతిరేకంగా, సందీప్‌ను తండ్రిలా భావిస్తున్నట్టు చెప్పడం చర్చనీయాంశమైంది. అప్పట్లో ఇబ్బంది పెట్టిన రధన్ ఇప్పుడు ప్రశంసలు కురిపించడం చూస్తే “ఇది ఏమి యూటర్న్ రా బాబు?” అన్నట్టే కామెంట్లు వినిపిస్తున్నాయి.


Recent Random Post: