
ఒకప్పుడు టాలీవుడ్ సినిమాల్లో వరుసగా కమెడియన్‌గా సందడి చేసిన అలీ, ఈ మధ్య సినిమాల్లో కొంచెం తక్కువగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడే ప్రత్యేక పాత్రల్లో మెరిసే అలీ, తాజాగా సుహాస్ హీరోగా, మాళవిక మనోజ్ హీరోయిన్గా నటిస్తున్న “ఓ భామ అయ్యో రామా” అనే సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
జులై 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న అలీ, తన పాత్ర గురించి మాట్లాడుతూ, “ఈ సినిమాలో నా పాత్ర ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుంది. ముఖ్యంగా సుహాస్‌తో ఉన్న ఎమోషనల్ సీన్లు సినిమాకు హైలైట్ అవుతాయి” అని చెప్పారు. ఇదే విషయాన్ని సుహాస్ కూడా ప్రమోషన్లలో పదే పదే చెబుతున్నాడు.
ఈ సందర్భంగా అలీ, హీరోయిన్ మాళవిక మనోజ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “మాళవిక వయసు కేవలం 18 ఏళ్లు. సినిమా విడుదలయ్యాక ఆమెకు ఎవరెవరు కర్చీఫ్ వేస్తారో చెప్పలేం. స్క్రీన్ మీద ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. నేను ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్స్‌ని చూసా. ‘సూపర్’ సినిమా చేస్తున్నప్పుడు అనుష్క కూడా ఇలానే చాలా సైలెంట్‌గా ఉండేది. కానీ తరువాత ఆమె చేసిన ‘అరుంధతీ’ సినిమా చూసి నేను భయపడ్డాను. అప్పట్లో సూపర్‌లో కనిపించిన అమ్మాయేనా అనిపించింది” అని అన్నారు.
ఇంకా మాట్లాడుతూ, “ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఏ స్థాయికి చేరుతారో చెప్పలేం. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఒక్క ఛాన్స్ సరిపోతుంది – మంచి టాలెంట్ ఉన్నవారు ఎప్పుడైనా టాప్ పొజిషన్‌కి వెళ్లొచ్చు” అంటూ చెప్పుకొచ్చారు అలీ.
ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను నవ్విస్తూ, ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్న అలీ, తన ఎనర్జీతో ఈ చిత్రం కూడా మంచి హిట్ అవుతుందనే నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు.
Recent Random Post:














