అల్లు అరవింద్ క్లారిటీ: ‘సింగిల్’ డైలాగ్ వెనుక అసలైన ఉద్దేశం

Share


అల్లు అరవింద్ సమర్పణలో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న సినిమా సింగిల్, మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. రిలీజ్ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది.

తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ నిర్వహించగా, అందులోని ఒక డైలాగ్ వివాదాస్పదమైంది. “ఆడవాళ్లు కాక్రోచ్‌ల్లాంటి వాళ్లు” అనే డైలాగ్ మీద మీడియా ప్రశ్నించగా, అల్లు అరవింద్ దీనిపై స్పందించారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ, “ఈ డైలాగ్ వాస్తవ ఉద్దేశాన్ని చాలామందికి సరైనగా అర్థం చేసుకోలేకపోయారు. బొద్దింకలు అణుబాంబు దాడులకూ తట్టుకోగల శక్తివంతమైన జీవులు. అదే తరహాలో మహిళలు కూడా అత్యంత బలమైనవారు. ప్రతి క్లిష్ట పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొగల సామర్థ్యం వారికి ఉంటుంది. ఇదే ఆ డైలాగ్ వెనుక భావం,” అన్నారు.

అల్లు అరవింద్ ఇంకా తెలిపారు, “మహిళలను చిన్నచూపు చూడాలన్న ఉద్దేశం సింగిల్ చిత్రంలో ఎక్కడా లేదు. ఇది వినోదాత్మకంగా ఉండే ఒక విభిన్నమైన కథా విన్యాసం. ప్రేక్షకులు సినిమా చూసేంతవరకూ నవ్వుతూ మునిగిపోతారు. ఇది ఇప్పటివరకు వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఉంటుంది” అన్నారు.


Recent Random Post: