టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప-2 మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. లెక్కల మాస్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పుష్ప-1 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మేకర్స్.. ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకుని రూపొందిస్తున్నారు. సినీ ప్రియులకు బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. డిసెంబర్ 6వ తేదీన సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
పుష్ప మూవీతో బన్నీ నేషనల్ వైడ్ గా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో తన యాక్టింగ్, మేనరిజంతో ఆకట్టుకున్న అల్లు అర్జున్.. కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. దీంతో ఆయన అప్ కమింగ్ మూవీలపై అందరి దృష్టి నెలకొంది. కానీ బన్నీ నెక్స్ట్ మూవీ ఇప్పటివరకు ఖరారు కాలేదు. ఎలాంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. దీంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.
అయితే పుష్ప-2 తర్వాత.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ వర్క్ చేస్తారని కొన్ని రోజుల పాటు జోరుగా ప్రచారం సాగింది. కానీ రెమ్యునరేషన్ విషయంలో చర్చలు కొలిక్కి రాకపోవడంతో అట్లీ తప్పుకున్నారని ఆ తర్వాత టాక్ వినిపించింది. అదే స్క్రిప్ట్ తో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఆయన సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆ ప్రాజెక్ట్ షూటింగ్ గ్రాండ్ గా స్టార్ట్ కానున్నట్లు సమాచారం.
కానీ వారు చెప్పిన స్క్రిప్ట్ నచ్చకపోవడంతో పాటు ఇతర కారణాల వల్ల బన్నీ ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. దాని బట్టి చూస్తే.. అల్లు అర్జున్ చేతిలో ఉన్నది పుష్ప-3 ఒకటే. కానీ ఆ మూవీ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లదు. చాలా టైమ్ పడుతుంది. ముఖ్యంగా పుష్ప-2 రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో డైరెక్టర్ త్రివిక్రమ్, అల్లు అర్జున్ మధ్య ఇటీవల చర్చలు జరిగినట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పాన్ ఇండియా రేంజ్ లో బన్నీతో త్రివిక్రమ్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ లైన్ చెప్పిన త్రివిక్రమ్.. త్వరలో ఫైనల్ స్క్రిప్ట్ ను నెరేట్ చేయనున్నారట. దీనిబట్టి చూస్తుంటే.. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివ్రికమ్ డైరెక్షన్ లోనే చేయనున్నట్లు అనిపిస్తోందని అంటున్నారు. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.
Recent Random Post: