
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ పేరు కేవలం నేమ్ మాత్రమే కాదు… అది ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఒకప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితమైన తన స్టార్ ఇమేజ్‌ను ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకు వెళ్లడం ఆయన గొప్ప విజయంగా చెప్పాలి. స్టెప్ బై స్టెప్, బ్రిక్ బై బ్రిక్ తన కెరీర్‌ను నిర్మించుకుంటూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు.
అసలు ప్రయాణం సాధారణంగా మొదలై, అసాధారణంగా మారింది. టాలీవుడ్‌లో వివిధ సినిమాలతో మెప్పించిన ఆయన, మాలీవుడ్ మార్కెట్‌లో డబ్బింగ్ మూవీతో క్రేజ్ సంపాదించిన తెలుగు తొలి హీరోగా నిలిచారు. ఆర్య సినిమా మలయాళంలో డబ్బింగ్ రూపంలో విడుదలై, అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పటివరకు మలయాళ మార్కెట్‌లో తెలుగు హీరోలకు పెద్ద క్రేజ్ ఉండలేదని చెప్పాలి.
కానీ అల్లు అర్జున్ స్టైల్, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ మదేశ్ ప్రేక్షకులను ఫుల్‌గా ఆకట్టుకున్నాయి. అక్కడి నుంచి ఆయనకు సౌత్‌లో మొదటి బలమైన అడుగు దశ ప్రారంభమైంది. ఆ తర్వాత కేవలం ఒక ఇండస్ట్రీకి పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా పుష్ప సినిమాలో గుర్తింపు పొందారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం కేవలం సినిమా మాత్రమే కాదు… బన్నీకి ఒక ఫెనామెనాన్గా మారింది. హిందీ బెల్ట్‌లో ఆయనకు ఊహించని స్థాయిలో అభిమానులు ఏర్పడ్డారు.
పుష్ప 2తో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. సినిమా విడుదలకు ముందే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి, ముఖ్యంగా బిహార్ లో జరిగిన ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా ఉంది. ఈ ఒక్క ఈవెంట్ ద్వారా పుష్ప 2 స్థాయి పూర్తిగా మారిపోయింది.
అసలు ఆశ్చర్యం జపాన్ మార్కెట్. తెలుగు హీరోగా అక్కడ భారీ క్రేజ్ సంపాదించడం అరుదైన విషయం. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ జపాన్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ఇక్కడి నుంచి ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లలో ఆయనకు ప్రత్యేక స్థానం ఏర్పడింది.
ఇది బన్నీ ప్లానింగ్‌కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అల్లు అర్జున్ దృష్టి కొలీవుడ్ పై పడింది. తమిళ ఇండస్ట్రీలో బలమైన మాస్ ఇమేజ్ ఉన్న ప్రముఖ డైరెక్టర్ అట్లీతో కలిసి బన్నీ సినిమా చేస్తారు. ఇది సూపర్ హీరో కాన్సెప్ట్తో రూపొందుతుంది. ఈ భారీ ప్రాజెక్టు కేవలం తమిళ మార్కెట్‌కి మాత్రమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్ను కూడా టార్గెట్ చేసే అవకాశముంది.
మొత్తంగా చూస్తే, మలయాళం నుండి మొదలై, పాన్ ఇండియా, జపాన్, ఓవర్సీస్, ఇప్పుడు కోలీవుడ్ వరకు… అల్లు అర్జున్ ప్రయాణం ఒక స్పష్టమైన ప్లాన్తో సాగుతోంది. రాజ్యాలను ఒక్కొక్కటిగా జయించే రాజులా, ఒక్కో మార్కెట్‌ను తనదైన శైలిలో ఆకట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. భవిష్యత్తులో ఆయన అన్ని ఇండస్ట్రీలను ఏలుతారా? అలెగ్జాండర్ స్థాయిలో పేరు సంపాదిస్తారా? అన్నది కాలమే చెప్పాలి.
Recent Random Post:















