సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీ తేజ్‌ను టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పరామర్శించారు. టీఎఫ్‌డీసీ చైర్మన్ మరియు ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని, శ్రీ తేజ్ తండ్రి భాస్కర్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
శ్రీ తేజ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న అల్లు అర్జున్, తగిన అన్ని విధాల సహాయం అందిస్తానని భాస్కర్‌కు భరోసా ఇచ్చారు. మీడియాతో మాట్లాడకుండా ఆస్పత్రి నుంచి వెళ్లిపోయిన అల్లు అర్జున్ రాకతో అక్కడ పోలీసు భద్రతను పెంచారు.
సందర్భంగా, ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే అల్లు అర్జున్ ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది. కిమ్స్ ఆస్పత్రి చుట్టుపక్కల భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.
Recent Random Post: