అవెంజర్స్: డూమ్స్‌డే – భారీ తారాగణంతో రాబోతున్న మాస్ ట్రీట్!

Share


మార్వెల్ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ సూపర్ హీరో అభిమానులను ఉత్సాహపరుస్తోంది. తాజాగా మార్వెల్ స్టూడియోస్ ఈ భారీ ప్రాజెక్ట్ తారాగణాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాలో కొత్త నటీనటులతో పాటు X-Men మరియు ఫాంటాస్టిక్ ఫోర్ ఫ్రాంచైజీల నుంచి కూడా స్టార్లు భారీ స్థాయిలో జాయిన్ అవ్వడం విశేషం. మొత్తం 27 మంది ప్రముఖ నటులు ఇందులో భాగమవుతుండటంతో సినిమా హాలీవుడ్‌లోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది.

క్రిస్ హెమ్స్‌వర్త్ థోర్‌గా, టామ్ హిడిల్‌స్టన్ లోకీగా, ఆంథోనీ మాకీ కెప్టెన్ అమెరికాగా, పాల్ రూడ్ యాంట్-మ్యాన్‌గా, లెటిటియా రైట్ బ్లాక్ పాంథర్‌గా, సిము లియు షాంగ్-చిగా, విన్‌స్టన్ డ్యూక్ ఎం బాకుగా కనిపించనున్నారు. థండర్‌బోల్ట్స్ చిత్రంలో కనిపించబోయే సెబాస్టియన్ స్టాన్ (ది వింటర్ సోల్జర్), ఫ్లోరెన్స్ పగ్ (యెలెనా బెలోవా), వ్యాట్ రస్సెల్ (యుఎస్ ఏజెంట్) కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇంతకుముందు X-Men ఫ్రాంచైజీలో కనిపించిన పాట్రిక్ స్టీవర్ట్ (ప్రొఫెసర్ X), ఇయాన్ మెక్‌కెల్లెన్ (మాగ్నెటో), జేమ్స్ మార్స్‌డెన్ (సైక్లోప్స్), రెబెక్కా రోమిజ్న్ (మిస్టిక్) పాత్రల్లో తిరిగి కనిపించనున్నారు. గతంలో గాంబిట్ పాత్ర కోసం ఎంపికైన చానింగ్ టాటమ్ కూడా ఈ చిత్రంలో భాగమవుతుండటం ఆసక్తికర విషయం.

ఫాంటాస్టిక్ ఫోర్ ఫ్రాంచైజీ నుంచి పెడ్రో పాస్కల్ (మిస్టర్ ఫాంటాస్టిక్), వెనెస్సా కిర్బీ (ది ఇన్విజిబుల్ ఉమెన్), ఎబోన్ మోస్-బాచ్రాచ్ (ది థింగ్), జోసెఫ్ క్విన్ (ది హ్యూమన్ టార్చ్) పాత్రల్లో కనిపించనున్నారు. గతంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ లో నామోర్ పాత్ర పోషించిన టెనోచ్ హుయెర్టా మెజియా కూడా తారాగణంలో చేరడం విశేషం.

అయితే ఈ లిస్ట్‌లో అభిమానులను మోస్ట్ ఎగ్జైట్ చేసే అంశం రాబర్ట్ డౌనీ జూనియర్ రీ-ఎంట్రీ. గతంలో ఐరన్ మ్యాన్‌గా తన సత్తా చాటిన డౌనీ జూనియర్ ఈసారి డాక్టర్ డూమ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ ప్రకటనను మొట్టమొదటగా San Diego Comic-Con 2023లో వెల్లడించారు.

అవెంజర్స్: డూమ్స్‌డే 2026 మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, దాని సీక్వెల్ అవెంజర్స్: సీక్రెట్ వార్స్ 2027 మే 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ భారీ తారాగణంతో అవెంజర్స్ ఫ్రాంచైజీ మరింత హైప్ క్రియేట్ చేస్తూ, మార్వెల్ ఫ్యాన్స్‌ను ఉత్సాహంలో ముంచెత్తుతోంది.


Recent Random Post: