ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో కొత్తగా ఏడువిమానాశ్రయాల నిర్మాణానికి ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు ఆర్థిక మరియు వాణిజ్య అభివృద్ధికి కీలకమైన అంశాలుగా భావిస్తున్నారు. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలు వంటి ప్రాంతాల్లో ఈ విమానాశ్రయాలు ఏర్పాటవుతాయి. ముఖ్యమంత్రి పౌరవిమానయాన శాఖ అధికారులతో సమావేశమై, ఈ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు.
ప్రధానంగా, కుప్పం విమానాశ్రయం రెండు దశల్లో నిర్మించబడనుంది. మొదటి దశలో 683 ఎకరాలు, రెండో దశలో 567 ఎకరాలు కేటాయించబడినట్టు ప్రకటించారు. శ్రీకాకుళం విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన ఫీజిబిలిటీ సర్వే పూర్తయింది. దగదర్తి విమానాశ్రయానికి 1,379 ఎకరాల భూమి అవసరమని తేలింది. నాగార్జునసాగర్‌లో 1,670 ఎకరాలు, తుని-అన్నవరం ప్రాంతంలో 757 ఎకరాలు గుర్తించబడ్డాయి.
గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భాగంగా, కొత్త టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం ఆకృతులలో నిర్మించనున్నారు. ఈ నిర్మాణం 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భోగాపురం విమానాశ్రయ ప్రగతి గురించి సమీక్ష నిర్వహించారు. తెదేపా హయాంలో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులు వైకాపా ప్రభుత్వంలో నిలిచిపోవడాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని అమలు చేయడానికి కృషి చేస్తుందని ఆయన చెప్పారు. ఈ కొత్త విమానాశ్రయాలు ప్రాంతీయ అభివృద్ధికి మరింత ఊతమిస్తాయని ఆశిస్తున్నారు.
Recent Random Post: