ఆది సాయికుమార్ 25వ సినిమా శంబాల: క్రిస్మస్ హిట్ కోసం రెడీ

Share


టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ సినిమా శంబాల, ఆది కోసం 25వ సినిమా అని చెప్పడం విశేషం. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న చాలా గ్రాండ్‌గా జరిగింది. న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజ్ అయిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ వేడుకలో ఆది మాట్లాడుతూ తన ఫీలింగ్స్, సినిమా ప్రీparation గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఈ ఈవెంట్‌లో ఆది మాట్లాడుతూ సినిమా కోసం టీమ్ ఎంత కష్టపడ్డారో వివరించారు. దర్శకుడు యుగంధర్ ముని స్క్రిప్ట్, మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని, నిర్మాతలు కూడా సినిమా అవుట్‌పుట్ కోసం పూర్తి సపోర్ట్ ఇచ్చారని, ఫలితంగా సినిమా అనుకున్న దానికంటే గ్రాండ్‌గా వచ్చిందని ఆది కాంఫిడెంట్‌గా చెప్పారు. అలాగే, టెక్నికల్‌గా విజువల్స్, సౌండ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని ప్రామిస్ చేశారు.

స్పీచ్ మధ్యలో ఆది తన ఫ్యామిలీ గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు. “తనకు సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలోనే పెరిగానని, ఉదయం 4 గంటలకే లేచి ఫైట్స్, డాన్స్ నేర్చుకుంటూ నా బాల్యం గడిచిందని, సినిమా కోసం పుట్టానని, ఇలాంటి ఫ్యామిలీలో పుట్టడం గర్వంగా ఉంది” అన్నారు.

తన తండ్రి డైనమిక్ స్టార్ సాయికుమార్ గురించి మాట్లాడిన ఆది కామెంట్స్ అభిమానులను టచ్ చేశాయి. “నాన్నా, నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం. కెరీర్‌లో నువ్వు అన్నీ సాధించావు, కానీ ఇప్పుడు ఉన్న ఏకైక టెన్షన్ నేనే. నాకు ఒక మంచి సినిమా పడి, హిట్ కొడితే నువ్వు రిలాక్స్ అవుతావు” అని తన మనసులో మాట బయటపెట్టారు. మాట వినగానే సాయికుమార్ ముఖంలో ఆనందం, ఎమోషన్ రెండూ కనిపించాయి.

తన ప్రయాణంలో సపోర్ట్ చేసిన స్నేహితులు సందీప్, తమన్, అశ్విన్‌లకు ఆది స్పెషల్ థాంక్స్ చెప్పారు. ముఖ్యంగా నాని గురించి చెప్పి, ఆయన ట్రైలర్ లాంచ్ చేయడం సినిమాకు పెద్ద బూస్ట్ ఇచ్చిందని, తోటి స్టార్‌లు తన ప్రతి పనిని గమనించి ఎంకరేజ్ చేస్తారని, ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారని, తన సక్సెస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారని గుర్తు చేసుకున్నారు.

మొత్తానికి, శంబాల డిసెంబర్ 25న థియేటర్లలోకి రాబోతోంది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అని ఆది నమ్ముతున్నారు. ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టి తన తండ్రి కోరికను నెరవేర్చుతానని, ఆయన ఆ చిన్న టెన్షన్‌ను తొలగిస్తానని ఆది బలంగా చెప్పాడు. ఈ క్రిస్మస్ ఆది కోసం మెమరబుల్ హిట్ తేలుతుందో చూడాలి.


Recent Random Post: