
తెరపై కొంతమంది స్టార్ హీరోలు అసలైన జుట్టుతో కాకుండా విగ్గులు వాడతారంటూ రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ‘వార్ 2’ హీరో హృతిక్ రోషన్, టీవీ హోస్ట్ కపిల్ శర్మ గురించి కూడా అలాంటి పుకార్లు వచ్చాయి. కానీ ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ ఈ రూమర్లకు తెరదించారు.
తాజా ఇంటర్వ్యూలో ఆలిమ్ హకీమ్ మాట్లాడుతూ, “హృతిక్ రోషన్, కపిల్ శర్మ నిజంగానే మంచి, సహజ జుట్టును కలిగి ఉన్నారు. వారెప్పుడూ విగ్గులు, హెయిర్ ప్యాచ్లు పెట్టుకోరు” అని తెలిపారు. అంతే కాకుండా, “నా జుట్టే నకిలీ కావచ్చు కానీ వారి జుట్టే అసలయినది” అని నవ్వుతూ చెప్పారు.
“హృతిక్ రోషన్ ‘వార్ 2’ లో జూనియర్ ఎన్టీఆర్తో పాటు అసలైన జుట్టుతోనే కనిపిస్తారు. ‘వార్’ లో హృతిక్ చాపర్ దగ్గర సీన్ చూసారా? నకిలీ జుట్టుతో అంత నేచురల్ ఫీల్ రాదు” అని అన్నారు.
‘వార్ 2’ లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్
తరువాతి ప్రాజెక్ట్ ‘వార్ 2’ లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 2025 ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. టీజర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన పొందింది.
Recent Random Post:















