ఇలా డిజ‌ప్పాయింట్ చేస్తే ఎలా సీత‌మ్మ‌?

సీత‌మ్మ అలియాస్ మృణాల్ ఠాకూర్ కూడా లావ‌ణ్య త్రిపాఠి లా తెలుగు అబ్బాయిన పెళ్లి చేసుకుని హైద‌రాబాద్ లో స్థిర‌ప‌డాలి అన్న‌ది నిర్మాత అల్లు అర‌వింద్ సార్ కోరిక‌. ఈ విష‌యాన్ని ఆయ‌న ఎంతో ఓపెన్ గా చెప్పారు. ఆయ‌న వాక్కు ఫ‌లిస్తే అంత‌కు మించి సంతోషం ఏం ఉంటుంది. ప్ర‌తిభావంతులంతా తెలుగు అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటే? మంచిదేగా..వాళ్ల కాంబినేష‌న్ లోనే ఇంకా మంచి చిత్రాలు చేయ‌డానికి ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల‌కు అవ‌కాశం ఉంటుంది.

అది సినిమా మార్కెట్ కి దోహదం చేసే అంశం. ఇక అదే వేదిక‌పై మీణాల్ సిగ్గుప‌డుతూ..న‌వ్వ‌తూ త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చింది. అర‌వింద్ గారు అలా అన‌డం…అందుకు మృణాల్ సిగ్గు ప‌డ‌టం నెట్టింట జోరుగా వైర‌ల్ అయింది. దీంతో మృణాల్ పెళ్లిపై అప్పుడే క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి. అమ్మ‌డు అర‌వింద్ గారి మాట‌ను నిజం చేస్తుందా? అంటూ నెటి జ‌నుల్లో చ‌ర్చ‌కొచ్చింది. అది మీడియా అంతటా వాయు వేగంగా విస్త‌రించింది.

చివ‌రికి మీణాల్ కుటుంబ స‌భ్యులు..స్నేహితులు..స‌న్నిహితుల్లో సైతం ఈ అంశం చ‌ర్చ‌కు దారితి సింది. అమ్మ‌డికి ఫోన్ చేసి మ‌రీ సంగ‌తేంటి? అని అడుగుతున్నారుట‌. తాజాగా ఈ ప్ర‌చార‌మంతా మృణాల్ దృష్టికి వెళ్ల‌డంతో ఓ వీడియో చేసి ఇన్ స్టా స్టోరీ పెట్టింది. పెళ్లి వార్త‌లు నాకు న‌వ్వు తెప్పించాయి. నేను ఎవ‌ర్నీ పెళ్లి చేసుకోవ‌డం లేదు. ఈ మాట చెప్పి మిమ్మల్ని బాధపెడుతునందుకు సారీ’ అంటూ ఆ రీల్ లో ఉంది.

ఇలా మృణాల్ స్పందించ‌డం అభిమానుల్ని నిరాశ‌ప‌రిచిన‌ట్లు అయింది. ఇదినిజ‌మైతే ఎంత బాగుండు? మ‌రో ముంబై బ్యూటీ హైద‌రాబాద్ కోడ‌ల‌య్యేదిగా అంటూ నెటి జ‌నులు స‌ర‌దాగా పోస్టులు పెడుతు న్నారు. ఇక టాలీవుడ్ లో మృణాల్ బిజీ గురించి తెలిసిందే. వ‌రుస‌గా సినిమాలు చేస్తుంది. నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న ‘ హాయ్ నాన్న’లో న‌టిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ స‌ర‌స‌న ‘ఫ్యామిలీ స్టార్’లోనూ న‌టిస్తోంది.


Recent Random Post: