“ఉగ్రదాడిపై ఆమిర్ ఖాన్ స్పందన: విమర్శలకు కౌంటర్”

Share


పహల్గామ్ దాడి అనంతరం జరిగిన ఆపరేషన్ సింధూర్ విజయంపై బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఆయనను ముస్లిం మతాభిమాని, పాకిస్తాన్ అనుకూలుడిగా ఆరోపించారు. ఈ ఆరోపణలపై సితారే జమీన్ పర్ రిలీజ్ ప్ర‌మోషన్ లో స్పందించిన ఆమిర్ ఖాన్ తన మనసులోని విషయాలను స్పష్టంగా వివరించారు.

“నేను భారత సైన్యంతో 8 రోజులు బార్డర్ పై గడిపాను. ఇలా చేసిన ఏకైక నటుడు నేనే. సైనికులతో కలిసి బంకర్‌లో రాత్రిని గడిపాను. వారితో కలిసి తిన్నాను, నడిచాను. వారి సమస్యలు తెలుసుకున్నాను. వారిని ధైర్యం చెప్పాలని వెళ్లాను కానీ చివరికి వాళ్లే నాకు ధైర్యం చెప్పారు” అంటూ ఆమిర్ చెప్పారు.

పహల్గామ్ ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా విమర్శించిన ఆయన, ఉగ్రవాదాన్ని మతంతో లింక్ చేయడం తప్పని అభిప్రాయపడ్డారు. “అమాయక ప్రజలను చంపమని ఏ మతం చెప్పదు. ఇలాంటి చర్యలు ఇస్లాం సిద్దాంతాలకు పూర్తిగా వ్యతిరేకం. ఉగ్రవాదాన్ని మతంతో ముడిపెట్టడం సరికాదు” అని ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు.

కార్గిల్ యుద్ధం తరువాత లేహ్ మీదుగా శ్రీనగర్ వెళ్లి అక్కడి ప్రతి రెజిమెంట్ లో ఉన్న భారత సైనికులను కలిసిన విషయాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. “సంక్లిష్ట వాతావరణంలో దేశాన్ని కాపాడటానికి వారు చేసే త్యాగం అమోఘం. వారిని చూసి నేను గర్వపడినాను. ఒక రాత్రి ఎనిమిది మంది సైనికులతో బంకర్‌లో గడిపాను” అన్నారు.

గతంలో టర్కీ అధ్యక్షురాలు ఎమిన్ ఎర్డోగన్‌ను కలవడం పై వచ్చిన విమర్శల గురించి కూడా స్పందించిన ఆమిర్, “అప్పుడు నేను ప్రజా ప్రతినిధిగా వెళ్లాను. ఆ తర్వాత టర్కీ పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడం తప్పే. అవసరమైన సమయంలో మేము స్నేహంగా ఉండగా, వారు పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడం బాధాకరం” అన్నారు.


Recent Random Post: