ఎన్టీఆర్ డబుల్ మేకోవర్‌కు రెడీ!

Share


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకోసం ఎన్టీఆర్ తన లుక్స్‌లో భారీ మార్పులు చేసుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఎప్పుడూ ఫిట్‌గా, మ‌స్సుల‌డ్ లుక్‌లోనే క‌నిపించిన ఎన్టీఆర్, ఈసారి మాత్రం ఊహించని విధంగా స్లిమ్ అవతారంలో దర్శనమివ్వనున్నాడు. నీల్ ఈ లుక్‌ను మాస్ మెప్పించేలా ఓ న్యూ డైమెన్షన్‌లో డిజైన్ చేశాడని ఇండస్ట్రీ టాక్.

అయితే ఇంత‌తో కథ ముగియ‌లేదు. ప్ర‌శాంత్ నీల్ చిత్రానంతరం ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్‌తో మ‌రో సినిమాకు సైన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం పూర్తిగా మైథలాజిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుండగా, ఇందులో ఎన్టీఆర్ కుమారస్వామి అనే పురాణ పాత్రకు ఆధారంగా ఉన్న ఓ మాస్ యెట్స్ మైథ్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ మళ్లీ మేకోవర్ కావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

నీల్ సినిమాకోసం బరువు తగ్గిన ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ సినిమాలో మాత్రం భారీ శ‌రీరంతో కనిపించాల్సి ఉంటుందట. అందుకే మ‌ళ్లీ ఫిజిక‌ల్ ట్రాన్స్‌ఫర్మేష‌న్ ప్రారంభించనున్నాడట. గతంలో ‘అరవింద సమేత’లో త్రివిక్ర‌మ్-ఎన్టీఆర్ కాంబోకి ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మ‌ళ్లీ వారిద్ద‌రూ క‌లిసి రూపొందిస్తున్న ఈ మిథిక‌ల్ సినిమా విష‌యంలో కూడా అదే స్థాయిలో హైప్ ఉంది.

ఎన్టీఆర్ ప్ర‌స్తుతం చేస్తున్న రెండు ప్రాజెక్టుల‌కూ ఫిజిక‌ల్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ చాలా కీల‌కం కావ‌డంతో ఆయ‌న డెడికేష‌న్‌కి మ‌రోసారి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఓ వైపు మాస్ యాక్షన్, మ‌రోవైపు మైథలాజిక‌ల్ డ్రామా – ఎన్టీఆర్ కెరీర్‌లో విభిన్న‌మైన లుక్ మార్పులు చూస్తుండ‌టం ప్రేక్షకులకు ఆసక్తికరంగా మారింది.


Recent Random Post: