
‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్, ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారుతోంది. సాధారణంగా కన్నడ నుండి వచ్చే భామలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంటుంది. అదే ట్రెండ్‌ను రుక్మిణి కూడా ఫాలో అవుతోంది. ఇటీవల నిఖిల్‌తో చేసిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో ఎక్కువగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, ఇప్పుడు మాత్రం ఆమెకు గట్టిగా ఛాన్స్‌లు వస్తున్నాయి.
ఇటీవల రుక్మిణి వసంత్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యిందని టాక్. ఆమె ఇప్పటికే షూటింగ్‌లో కూడా పాల్గొనిందని సమాచారం. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా అంటే రుక్మిణికి టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ ఖాయమని చెప్పొచ్చు.
ఈ సినిమాకి గాను ఆమె భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని టాక్. ఇప్పటి వరకు ఆమె తక్కువ పారితోషికంతోనే సినిమాలు చేసినా, ఈ ప్రాజెక్ట్ కోసం మాత్రం కోటిన్నర వరకూ డిమాండ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల బడ్జెట్లు 200–300 కోట్లు ఉంటున్నాయి. అలాంటప్పుడు స్టార్ హీరోయిన్స్ కూడా 5–6 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అందుకే రుక్మిణి డిమాండ్ కూడా తార్కికంగానే కనిపిస్తోంది.
ఈ సినిమాతో రుక్మిణికి తెలుగులో మరిన్ని అవకాశాలు ఖాయమనే చెప్పాలి. ఎన్టీఆర్ లాంటి స్టార్‌తో కలిసి నటించడం వల్ల ఆమె క్రేజ్ మరో లెవెల్‌కి వెళ్లే ఛాన్స్ ఉంది. రాబోయే రోజుల్లో రుక్మిణి వసంత్ టాలీవుడ్‌లో పెద్ద హీరోయిన్‌గా నిలవనుందా? అని చెప్పేందుకు ఈ సినిమా రిజల్ట్ కీలకం కానుంది.
Recent Random Post:














