ఏపీ ప్రభుత్వం: ఉద్యోగులకూ పెన్షనర్లకూ డీఏ పెంపు, ఆర్టీసీ పదోన్నతులు జనవరి నుంచి

Share


ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లలో కొన్ని విషయాలపై తక్షణమే హామీ ఇచ్చారు. ముఖ్యంగా కరువు భత్యం (డీఏ) పెంపుపై ఆయన హామీ ఇచ్చారు, దీనికి సుమారు 2,000 కోట్ల రూపాయల వ్యయం కావాల్సి ఉంది.

ఈ హామీని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డీఏలో 3.64% పెంపు జరుగుతోంది. ప్రస్తుత 33.67% డీఏ జనవరి 1వ తేదీ నుంచి 37.31%కు చేరుతుంది. పెంపు చేసిన ఈ డీఏ మొత్తాన్ని ఉద్యోగులు జనవరి నెల వేతనంలో పొందనున్నారు. ఈ ఉత్తర్వులను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ జారీ చేశారు.

అదేవిధంగా, ఆర్టీసీ ఉద్యోగుల విషయానికీ సీఎం చంద్రబాబు హామీ నిలబెట్టారు. సుదీర్ఘకాలంగా ప్రోమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యపై శనివారం జరిగిన చర్చలో సీఎం తక్షణమే స్పందించి, పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు దీపావళి సందర్భంగా సోమవారం జారీ చేసిన జీవో ద్వారా, ఆర్టీసీ ఉద్యోగులకి కూడా జనవరి నుండి పదోన్నతులు లభించనుండగా, ప్రభుత్వం స్పష్టం చేసింది.


Recent Random Post: