
దుల్కర్ సల్మాన్ – రానా దగ్గుబాటి కాంబోలో వచ్చిన ‘కాంత’ సినిమా నవంబర్ 14న రిలీజ్కు రెండు రోజులు మాత్రమే ఉన్నప్పటి క్రమంలో లీగల్ టెన్షన్ మొదలైంది. ఈ సినిమా 1950ల నాటి తమిళ లెజెండరీ సూపర్ స్టార్ ఎం.కె. త్యాగరాజ భాగవతార్ (MKT) బయోపిక్ అని, ఆయనను తప్పుగా, అనైతికంగా చూపించారంటూ ఆయన మనవడు చెన్నై కోర్టులో పిటిషన్ వేయడం కలకలం రేపింది. సినిమా వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేసిన ఈ కేస్ కోలీవుడ్లో హంగామా సృష్టించింది.
ఈ సమస్యను కంట్రోల్ చేయడానికి ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి స్వయంగా రంగంలోకి దిగారు. ‘కాంత’ టీమ్ నుండి అఫీషియల్ క్లారిటీ ఇచ్చి, ఈ సినిమా ఏ ఒక్కరినీ టార్గెట్ చేయడం లేదని స్పష్టం చేశారు. రానా తన అఫీషియల్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేశారు: “మేము ఎవరినీ టార్గెట్ చేయడం లేదు.. కాంత ఒక కల్పిత కథ”.
ఈ స్టేట్మెంట్ ద్వారా, సినిమా బయోపిక్ కాదని, కాబట్టి ఎవరినీ టార్గెట్ చేయడం లేదా అనుమతులు అవసరం లేనటుగా లీగల్గా రక్షణ ప్రయత్నం చేశారు. అయితే, కల్పిత కథ అయినా 1950ల ఇండస్ట్రీ బ్యాక్డ్రాప్ ఎందుకు అనేది ప్రేక్షకులకు ప్రశ్నగా ఉంది. దీనికి రానా మునుపు ఇంటర్వ్యూలో క్లారిఫికేషన్ ఇచ్చారు: “ఇది ఏ ఒక్కరి బయోపిక్ కాదు, కానీ 1950లు, 60లు, 70లలో జరిగిన పలు నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో రాసుకున్నది.”
అసలు వివాదం MKT మనవడు వేసిన పిటిషన్లో ఉంది. ‘కాంత’లో MKT గారిని చివరి రోజుల్లో అనైతికంగా, పేదవాడిగా చూపించారంటూ, ఆయనకు గౌరవం లేదు అని ఆరోపించారు. రానా మాత్రం “మేం ఎవరినీ టార్గెట్ చేయడం లేదు, ఇది కల్పిత కథ” అని చెబుతూ ఆ ఆరోపణలను నేరుగా ఖండించారు.
రిలీజ్ రెండు రోజులు ముందు రానా ఈ క్లారిటీ ఇవ్వాల్సి రావడానికి కారణం: చెన్నై కోర్టు ఈ పిటిషన్పై నవంబర్ 18 వరకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది, కానీ సినిమా నవంబర్ 14న రిలీజ్. ఆడియన్స్, డిస్ట్రిబ్యూటర్లకు భరోసా ఇవ్వడం కోసం రానా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ఫిక్షన్ మాత్రమే, ఇన్స్పిరేషన్ ఆధారంగా రాసిన సినిమా అని స్పష్టత ఇచ్చారు.
ఇప్పటికీ, ఈ క్లారిటీ MKT ఫ్యామిలీని సంతృప్తి పరుస్తుందా? లేదా కోర్టు లీగల్ వాదనను అంగీకరిస్తుందా అనేది మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
Recent Random Post:














