కార్గిల్ యుద్ధం, “ఆప‌రేష‌న్ స‌ఫేద్ సాగ‌ర్” వెబ్ సిరీస్

Share


దేశ చరిత్రలోనే అత్యంత కీలక ఘట్టంగా నిలిచిన కార్గిల్ యుద్ధం ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలో తెరపైకి రాబోతుంది. భారత-పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ ఘోర యుద్ధం, భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ ద్వారా పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టేందుకు చేపట్టిన ఒక ముఖ్యమైన కార్యకలాపం. ఇప్పుడు ఈ ఘట్టం గురించి నెట్‌ఫ్లిక్స్ ఓ వెబ్ సిరీస్ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించడానికి సిద్దార్ధ్ ఎంపికయ్యారు. అంతే కాకుండా, జమ్మీ షేర్గిల్, అభయ్ వర్మ, మిహిర్ అహుజా తదితర నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కార్గిల్ యుద్ధం సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ విధంగా వ్యూహాలను అమలు చేసింది? సైనికుల ధైర్యంతో ప్రాణాలు అర్పించిన వారి కృషిని కళ్ల ముందు ఆవిష్కరించబోతున్న ఈ ప్రాజెక్ట్, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

సిద్దార్ధ్ తన కెరీర్ పతన దశలో ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌ ద్వారా పెద్ద అవకాశాన్ని అందుకున్నాడు. గతంలో త‌మిళ్‌లో కొన్ని ప్రాజెక్ట్స్ చేసినా, తెలుగులో పెద్ద విజయాలు సాధించలేదు. మహా సముద్రం తర్వాత తెలుగు సినిమాలో అవకాశాలు తగ్గినా, ఈ సిరీస్ లో పెద్ద పాత్రతో ప్రవేశించటం, అతనికి ఒక కొత్త దిశను చూపిస్తుంది. ఇక, ఈ ప్రాజెక్ట్ విజయం సాధిస్తే, అది సిద్దార్ధ్కి మంచి పేరు తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి.

ఆపరేషన్ సఫేద్ సాగర్ పై ఆధారిత ఈ సిరీస్ చాలా మందికి ఆకట్టుకుంటుందని, సైనికులు, వారి ధైర్యం, దేశభక్తి చూపిన క్షణాలను సమర్పించే కధతో ఇది పెద్ద విజయాన్ని సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.


Recent Random Post: