
కింగ్ నాగార్జున 100వ సినిమా ఎప్పుడు మొదలవుతుందా? అనే ఆతృత అక్కినేని అభిమానుల్లో ఏడాదిన్నరుగా కొనసాగుతోంది. ‘నా సామి రంగ’ తర్వాత ఆయన నటించిన కూలీ, కుబేర సినిమాల్లో కీలక పాత్రలతో మాత్రమే కనిపించడంతో, నాగ్ సోలో ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను తమిళ దర్శకుడు రా. కార్తిక్ దర్శకత్వంలో చేయనున్నట్లు ఫిక్స్ అయింది. పెద్దగా అనుభవం లేని దర్శకుడు అయినా, ఆయన కంటెంట్‌పై నమ్మకం ఉంచి నాగార్జున ముందుకు వెళ్తున్నారని సమాచారం.
తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. ఆగస్టు 29న నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా అధికారిక ప్రకటన రానుంది. అదే రోజు లాంచ్ డేట్‌ని కూడా రివీల్ చేసే అవకాశం ఉందని అన్నపూర్ణ స్టూడియోస్ వర్గాలు చెబుతున్నాయి. నాగ్ లుక్ ఫిక్స్ అయిందనీ, దానిని పుట్టినరోజు రోజు రిలీజ్ చేయాలా లేక మరో స్పెషల్ డేట్ కోసం వేచి చూడాలా అనే చర్చ నడుస్తోంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే నిర్మించబోతున్నారు. ఈ బ్యానర్‌కు 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో 100వ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. హీరోయిన్ ఎవరు? మిగతా కీలక పాత్రల్లో ఎవరు నటిస్తారు? అనే వివరాలు త్వరలో వెలువడతాయి. బాలీవుడ్ హీరోయిన్ను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందన్న వార్తలు ఇప్పటికే మీడియాలో వినిపిస్తున్నాయి.
ఇక ఇటీవల కుబేరతో హిట్ కొట్టిన నాగ్, కూలీ మాత్రం ఆశించిన స్థాయిలో నిలబడలేదనే టాక్ వచ్చింది. దీంతో ఆయన హీరోగా కొనసాగుతారా? లేక మరో కొత్త ప్రయాణం మొదలుపెడతారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా, ఇకపై గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేయాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
బంగార్రాజు, నా సామి రంగ తర్వాత నాగార్జునకు సోలో కమర్షియల్ హిట్ రాకపోవడంతో, అభిమానులు ఆయన 100వ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Recent Random Post:















