కియారా అద్వానీ తల్లి అయ్యాక స్టైలిష్ రీ ఎంట్రీ

Share


సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ వివాహం తరువాత లేదా తల్లిగా మారిన తర్వాత సినిమాలకు విరామం తీసుకుంటారు. అయితే ఈ రోజుల్లో కొత్త తరహా హీరోయిన్స్ ప్రెగ్నెంట్ అయినప్పటికీ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఆలియా భట్, దీపికా పదుకొనే లాంటి స్టార్‌ లు కూడా ప్రెగ్నెన్సీ సమయంలో నటించి, నటనకు ఉన్న ప్యాషన్‌ని ప్రూవ్ చేసారు. కొంతమంది తల్లితనం తర్వాత కొన్ని రోజులకే షూటింగ్స్‌లో పాల్గొని అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.

ఇలాంటి స్టార్‌లలో కియారా అద్వానీ ఒకరు. ఈ ఏడాది ఆమె రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన వార్ 2 వంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటించింది. రెండు చిత్రాలు భారీ బడ్జెట్ అయినప్పటికీ, బాక్సాఫీస్‌లో ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. అయినప్పటికీ కియారా ప్రెగ్నెన్సీ కారణంగా నిరాశపడలేదు.

తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కియారా సోషల్ మీడియాలో గ్యాప్ తర్వాత తిరిగి ప్రెజెంట్ అయింది. ఇంస్టాగ్రామ్‌లో ఆమె కొన్ని స్టైలిష్ ఫోటోలను షేర్ చేసింది. ఆరెంజ్ కలర్ డ్రెస్ మరియు బాడీ కాన్ అవుట్‌లో ఫోటోలు భిన్నమైన ఆకర్షణతో అందరి దృష్టిని ఆకర్షించాయి. మిర్రర్ ముందు స్టైలిష్ ఫోజులు ఇచ్చిన కియారా ఫోటోలకు “చివరికి నాకు ఒక రాత్రి ఫ్రీగా దొరికింది. ఈ రాత్రిని నన్ను ఆస్వాదించనివ్వండి” అని క్యాప్షన్ పెట్టింది. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు ఆమె అందానికి మెచ్చుతూ, తల్లి అయిన తర్వాత కూడా కియారాలో మార్పులు రాలేదని, ఇంకా సూపర్ క్యూట్ అని కామెంట్లు చేస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే, కియారా ప్రస్తుతానికి యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్‌లో విడుదల కానుంది. రిలీజ్‌కు మూడు నెలల ముందు, ఆమె తిరిగి షూటింగ్‌లో పాల్గొనబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోటోలు ద్వారా కియారా అభిమానుల దృష్టిని మరింత ఆకర్షిస్తోంది.


Recent Random Post: