కియారా కోసం యశ్‌ గొప్ప మనసు.. టాక్సిక్‌ షూటింగ్‌ ముంబైకి షిఫ్ట్!

Share


కేజీఎఫ్‌ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్‌, కేజీఎఫ్‌ 2 బ్లాక్‌బస్టర్‌ తర్వాత తన తదుపరి చిత్రం విషయంలో ఎంతో కేర్‌ తీసుకున్నాడు. ఎట్టకేలకు గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో ‘టాక్సిక్‌’ అనే భారీ యాక్షన్‌ ఎంటర్టైనర్‌కు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక టాక్సిక్‌ షూటింగ్‌ దాదాపుగా పూర్తి కాగా, కియారా గర్భవతిగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె సన్నివేశాలన్నిటినీ ముందుగానే పూర్తి చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ విషయంలో యశ్‌ తన గొప్ప మనసు చాటుకున్నాడు. షూటింగ్‌ ప్లాన్‌ బెంగళూరులో ఉండగా, కియారా ప్రయాణంలో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో షూటింగ్‌ను పూర్తిగా ముంబైకి మార్చారు.

యశ్‌ స్వయంగా రెండు నుండి మూడు వారాల పాటు ముంబైలో మకాం వేసి కియారాతో సంబంధించిన సీన్లను పూర్తి చేశారు. ఆమెకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నాడు. టాక్సిక్‌లో కియారాను కొనసాగించడం కూడా యశ్‌, గీతూ మోహన్‌దాస్‌ల గొప్ప నిర్ణయమే. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో కొత్త హీరోయిన్‌ తీసుకునే అవకాశం ఉంటేను కూడా, వారు కియారాపై నమ్మకాన్ని చూపారు.

యశ్‌ ఈ సినిమాకు హీరోగానే కాకుండా సహ నిర్మాత కూడా. బడ్జెట్ పెరుగుతుందన్న ఆలోచన లేకుండా కియారా కోసం షూటింగ్‌ను షిప్ట్ చేయడం పెద్ద మనసుని చూపిస్తోంది. ప్రస్తుతం కియారా షూటింగ్స్‌కి బ్రేక్‌ ఇచ్చినప్పటికీ, డెలివరీ తర్వాత మళ్లీ గ్రాండ్‌ రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ లతో వార్ 2 లో కూడా నటిస్తోంది.


Recent Random Post: