కీరవాణి సర్‌ప్రైజ్: పవన్ కోసం స్పెషల్ సాంగ్!

Share


టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యేకంగా రాజమౌళి కుటుంబం అయితే పవన్‌ పట్ల ఉన్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉంటుంది. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్‌లు గతంలో ఎన్నోసార్లు పవన్‌పై తమ ప్రేమను వ్యక్తపరిచారు. ఇప్పుడు ఆ కోవలోకి సంగీత దారుడు ఎం.ఎం. కీరవాణి కూడా చేరిపోయారు.

తొలిసారిగా పవన్ కళ్యాణ్‌ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్న ప్రాజెక్ట్‌ “హరిహర వీరమల్లు”. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కీరవాణి పవన్ అభిమానులను ఒక్కసారిగా షాక్ చేశాడు. పవర్ స్టార్ కోసం ప్రత్యేకంగా కంపోజ్ చేసిన ఓ పాటను తన టీంతో కలిసి స్టేజ్ మీద లైవ్‌గా పాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతే కాదు, ఈ పాట గురించి పవన్‌కీ, నిర్మాత ఏఎం రత్నంకూ ముందుగా తెలియదని చెప్పడంతో ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నెలకొంది.

ఈ పాటలో పవన్ కెరీర్‌లోని ప్రధాన సినిమాల పేర్లను చక్కగా కలిపి రచించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ‘అత్తారింటికి దారేది’, ‘ఖుషి’, ‘తమ్ముడు’, ‘కాటమరాయుడు’, ‘అజ్ఞాతవాసి’, ‘గబ్బర్ సింగ్’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘గుడుంబా శంకర్’, ‘తీన్ మార్’, ‘బ్రో’, ‘వకీల్ సాబ్’, ‘జల్సా’, ‘గోపాల గోపాల’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఇలా అన్నీ సినిమాల పేర్లు ఒకే పాటలో చెరిపేసి కీరవాణి మ్యాజిక్ చూపించాడు.

పాట చివరలో ‘హరిహర వీరమల్లు’ పేరుతో ముగించడంతో ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ ప్రత్యేక గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ అభిమానులకు ఇది నిజంగా ఒక ఫుల్ మీల్స్‌ అన్నట్లే!


Recent Random Post: