
దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఓ ఇంటర్వ్యూలో తాను కూలి సినిమాకు 50 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు ఓపెన్‌గా చెప్పిన సంగతి ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. సాధారణంగా స్టార్ డైరెక్టర్లు ఇలా బహిరంగంగా రెమ్యూనరేషన్ విషయాలు షేర్ చేయరు. మీడియాలో ఎన్ని వార్తలు వచ్చినా మౌనంగా ఉండటం, స్పందించకపోవడం మనం చూసే ఉన్నాం. కానీ లోకేష్ మాత్రం ధైర్యంగా చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
అంతేకాదు, లియో 600 కోట్లు కలెక్ట్ చేయగా, ఇప్పుడు తాను తీసుకునే రెమ్యూనరేషన్ రెట్టింపు కావడం సహజమేనని, ఇది మార్కెట్ డిమాండ్ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశాడు. లోకేష్ చెప్పే మాటల్లో లాజిక్ ఉంది. ఎందుకంటే కూలి ప్రాజెక్ట్‌కి వచ్చిన హైప్ కు కారణం కేవలం రజనీకాంత్ మాత్రమే కాదు.
ఒకవేళ ఇదే టైటిల్, ఇదే కథతో మరో దర్శకుడు — ఉదాహరణకు వెంకట్ ప్రభు లేదా లింగుస్వామి — అయితే ఇంత స్థాయి క్రేజ్ వచ్చేది కాదు. ఎందుకంటే రజనీకాంత్ పేరు మీదనే బిజినెస్ జరగడం లేదు. జైలర్ మినహాయించి, పేట, కాలా, కబాలి, 2.0 వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయిన దాఖలాలే ఉన్నాయి.
కానీ లోకేష్ బ్రాండ్ తో తలైవర్ కలయిక అయితే ప్రాజెక్ట్ కి ఎనలేని క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ అన్ని భాషల్లో విస్తరించింది. ఇదే జోష్ లో లోకేష్ అమీర్ ఖాన్ తో చేయబోయే సినిమాకు 100 కోట్ల పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నా ఎవ్వరూ ఆశ్చర్యపోరు. పైగా కూలి బ్లాక్ బస్టర్ అయితే, అంతకంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది కూడా.
ఈ సినిమా కోసం రెండేళ్లుగా కష్టపడిన లోకేష్ కనగరాజ్, దీన్ని పాన్ ఇండియా ప్రాజెక్టుగా కాకుండా సాధారణ కమర్షియల్ ఫార్మాట్లో రూపొందించడమే ప్రత్యేకత. అయినప్పటికీ, నేషనల్ లెవల్ మార్కెట్ మీద భారీ హైప్ ఉంది. ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న కూలికి తమిళనాడులో దాదాపు ప్రతి థియేటర్లో విడుదల రోజు నుండి స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు.
అయితే అదే రోజు వార్ 2 కూడా విడుదలవుతుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో షోలు, పంపకాలు, స్క్రీన్ షేరింగ్ విషయంలో మార్పులు ఉండొచ్చని అంటున్నారు.
Recent Random Post:














