కూలీ సినిమ, తెలుగు రైట్స్ కోసం తీవ్ర పోటీ

Share


సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ కూలీ ప్రేక్షకులలో భారీ అంచనాలు కలిగిస్తోంది. ఉపేంద్ర, నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా, యాక్షన్, గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రజినీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, సినిమా ప్రియులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా భారీ క్రేజ్ పొందింది.

ఈ ఏడాది విడుదలకానున్న కూలీ సినిమా తెలుగులో మంచి డిమాండ్‌ను ఏర్పరచుకుంది. ఈ నేపథ్యంలో, కూలీ తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం పెద్ద పోటీ మొదలైంది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ లో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా హక్కుల కోసం టాలీవుడ్‌లోని పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి.

ప్రధానంగా, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ నాగవంశీ ఈ హక్కుల కోసం పోటీపడుతున్నట్లు సమాచారం. అయితే, నిర్మాతలు కూలీ తెలుగు రైట్స్ కోసం రూ. 40 కోట్ల రేటు చెబుతుండగా, ఎవరైతే అంతకు ఎక్కువ ఆఫర్ చేస్తే వారికి తెలుగు రైట్స్ అమ్మనున్నట్లు సమాచారం. ఈ సినిమా లానే, సూర్య న‌టిస్తున్న రెట్రో సినిమా తెలుగు హక్కులకు కూడా పోటీ ఏర్పడింది. చివరికి, సితార ఎంటర్‌టైన్మెంట్స్ నాగవంశీ ఆ సినిమా తెలుగు హక్కులను దాదాపు రూ. 9 కోట్లకు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అదే పరిస్థితి కూలీ తెలుగు రైట్స్‌కు కూడా ఏర్పడింది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఆఖరి సినిమా లియో తెలుగు హక్కులను కూడా నాగవంశీనే సొంతం చేసుకుని, తెలుగులో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం, కూలీ సినిమా షూటింగ్ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో జరుగుతోంది. మార్చి నెలాఖరున షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్న ఈ సినిమా టీం, టీజర్‌ను ఈ నెలలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు, సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.


Recent Random Post: