
తెలుగు ప్రేక్షకులకు ‘1 నేనొక్కడినే’ చిత్రంతో పరిచయమైన కృతి సనన్ బాలీవుడ్లో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదటి తెలుగు సినిమా కమర్షియల్‌గా ఆశించిన విజయం అందుకోలేకపోయినా, బాలీవుడ్లో ‘హీరోపంతీ’ చిత్రంతో సక్సెస్ అందుకుంది. ఆ సినిమా హిట్టవడంతో ఆమెకు అక్కడ వరుసగా అవకాశాలు వచ్చాయి. అనంతరం టాలీవుడ్లో మరోసారి నాగచైతన్యతో కలిసి ‘దోచేయ్’ చేసింది కానీ అది కూడా ఫ్లాప్ కావడంతో తెలుగుకు పూర్తిగా దూరమైంది. అప్పటినుంచి ఆమె నటించిన కొన్ని హిందీ సినిమాలు తెలుగులో డబ్ అవుతూ వస్తున్నాయి.
2023లో ప్రభాస్‌తో కలిసి ‘ఆదిపురుష్’ ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇటీవలే ఆమె వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కృతి సనన్ వ్యాపారవేత్త కబీర్ బహియాతో ప్రేమలో ఉంది అన్న వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం షూటింగ్స్‌తో బిజీగా ఉన్నా, సమయం దొరికినప్పుడల్లా ప్రియుడు కబీర్ బహియాతో కలిసి హాలిడే ట్రిప్స్ ప్లాన్ చేస్తుంది. తాజాగా లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో వీరిద్దరిని కలిసి చూడటం జరిగింది. అక్కడ జరిగిన ఇండియా vs ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ వీరిద్దరూ కలిసి ఎంజాయ్ చేశారు. స్టేడియంలో వీరిని గుర్తించిన అభిమానులు తీసిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఈ జంట మొదటిసారి బెంగళూరులో జరిగిన ఓ స్నేహితుడి పెళ్లిలో కలిసినట్టు సమాచారం. అక్కడినుంచి వీరి స్నేహం ప్రేమగా మారిందట. త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్టు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పెళ్లి తర్వాత కూడా కృతి సనన్ తన కెరీర్‌ను కొనసాగించనుందని టాక్.
ఇక కబీర్ బహియా లండన్‌లో వ్యాపారాలతో బిజీగా ఉంటే, కృతి సైతం షూటింగ్స్ లేకపోతే ఎక్కువగా లండన్‌లోనే ఉంటుందని తెలుస్తోంది. వీరి రిలేషన్షిప్ కబీర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోతో పక్కాగా ధృవపడింది.
Recent Random Post:















