కోలీవుడ్‌లో సీక్వెల్స్ జోరు… లోకేష్, నెల్సన్ హైలైట్

Share


ఒక‌ప్పుడు సీక్వెల్స్ అంటే ప్రధానంగా బాలీవుడ్‌కే పరిమితం. బ్లాక్‌బస్టర్ సినిమా వచ్చిందంటే వెంటనే అది ఒక ఫ్రాంచైజీగా మారి, వరుసగా నాలుగైదు భాగాలు విడుదల కావడం సాధారణమే. 20 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలకు కూడా సీక్వెల్స్ తీసుకురావడంలో బాలీవుడ్ ముందంజలో ఉండేది. ఇప్పటికీ ఆ ట్రెండ్ అక్కడ కొనసాగుతూనే ఉంది.

అదే మార్గంలో నడుస్తూ టాలీవుడ్‌లో కూడా సీక్వెల్స్ ట్రెండ్ బలంగా మొదలైంది. ఒకే కథను రెండు భాగాలుగా చెబుతూ… కంటిన్యూటీ పేరుతో సీక్వెల్స్ రూపొందించడం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా పాన్ ఇండియా కథల విషయంలో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది.

రీజనల్ మార్కెట్ ఆధారంగా హిట్ సినిమాలకు సీక్వెల్స్ చేసే పద్ధతి బలపడుతోంది. టాలీవుడ్, బాలీవుడ్‌ను గమనించిన కోలీవుడ్ కూడా ఇప్పుడు సీక్వెల్స్–ఫ్రాంచైజీ ప్రపంచంలో అడుగుపెట్టింది. లోకేష్ కనగరాజ్, మిస్కిన్, మిత్రన్, నెల్సన్ దిలీప్‌కుమార్, సెల్వరాఘవన్ వంటి దర్శకులు సీక్వెల్స్‌పై దృష్టి పెట్టి వేగంగా పనిచేస్తున్నారు. ఇందుకు ప్రధాన స్పూర్తి టాలీవుడ్ విజయాలేనని చెప్పాలి. తెలుగు సినిమాలు పాన్ ఇండియాగా సత్తా చాటిన తర్వాత, “మనం ఎందుకు సీక్వెల్స్ తీయకూడదు?” అన్న ఆలోచనతో కోలీవుడ్ అడుగులు వేగం పుంజుకున్నాయి.

ఈ సీక్వెల్స్ ట్రెండ్‌లో ముఖ్యంగా ఇద్దరు దర్శకులు హైలైట్ అవుతున్నారు—లోకేష్ కనగరాజ్ మరియు నెల్సన్ దిలీప్‌కుమార్.

నెల్సన్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘జైలర్ 2’ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం ‘జైలర్’ 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో, రెండో భాగం సులభంగా 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో ఉన్నాయి. ఈ సినిమా మీద అంచనాల స్థాయి అంత భారీగా ఉందనడంలో సందేహం లేదు.

ఇప్పటివరకు కోలీవుడ్‌కు 1000 కోట్ల క్లబ్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. లోకేష్ కనగరాజ్ తన LCU ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఆశించిన స్థాయి చేరుకోలేకపోయాడు. కొన్ని సినిమాలు 500 కోట్ల మార్క్‌ని టచ్ చేసినా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆ విమర్శలకు తగిన సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది.

దీనిలో భాగంగా ‘ఖైదీ 2’ సిద్ధమవుతోంది. ‘ఖైదీ’ దక్షిణాది మార్కెట్లో సాధించిన అద్భుత స్పందన అందరికీ తెలిసిందే. అందుకే రెండో భాగాన్ని మరింత భారీ స్కేల్‌తో ప్లాన్ చేస్తున్నాడు లోకేష్. ఈ విజయంతో వచ్చిన విమర్శలకు గట్టిగా బదులివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ ఆలస్యం అయినా, ‘ఖైదీ 2’ను తప్పనిసరిగా బ్లాక్‌బస్టర్‌గా తీర్చిదిద్దాలని ఆయన బ్యాక్‌ఎండ్‌లో శ్రద్ధగా పనిచేస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ మొదలవ్వాల్సి ఉన్నా, లోకేష్ హీరోగా కూడా ఓ సినిమా చేస్తుండటంతో స్వల్ప ఆలస్యం జరిగింది. వచ్చే ఏడాది ‘ఖైదీ 2’ రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.


Recent Random Post: