
ఇటీవల తెరపై కనిపించే సంఖ్య తగ్గించిన దగ్గుబాటి రానా, తన తండ్రి సురేష్ బాబు బాటలోనే ప్రొడక్షన్ ను సీరియస్ గా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కంటెంట్ పై నమ్మకం ఉంచుతూ, కమర్షియల్ ఫార్ములాల నుంచి దూరంగా, తెలుగు సినిమాను కొత్త ట్రెండ్ వైపు నడిపించే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు. స్టార్ క్యాస్టింగ్ పెట్టే స్థాయి ఉన్నప్పటికీ, క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యమని నమ్మి, కేరాఫ్ కంచరపాలెం నుంచి 35 చిన్న కథ కాదు దాకా తన ప్రొడక్షన్ లో చేసిన ప్రయోగాలు హిట్స్ తో పాటు అవార్డులను కూడా సాధించాయి. ఇప్పుడు మరింత ముందుకెళ్లి, ప్యాన్ ఇండియాను మించి గ్లోబల్ స్టేజ్ వైపు దృష్టిపెట్టాడు.
ఇండో-అమెరికన్ దర్శకుడు బెన్ రేఖీతో రానా ఓ ప్రాజెక్టును లాక్ చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. బెన్ రేఖీ ట్రాక్ రికార్డు చూస్తే, రానా ఎంచుకున్నది సామాన్య దర్శకుడు కాదని అర్థమవుతోంది. న్యూయార్క్ యూనివర్సిటీ టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన బెన్, వార్నర్ బ్రదర్స్ నుండి గ్రాంట్ అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు. 2005లో వాటర్ బోర్న్ ద్వారా దర్శకుడిగా మారిన ఆయన, 2016లో భారత్‌లోనే చిత్రీకరించిన ది ఆశ్రమ్ ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 2019లో వచ్చిన వాచ్ లిస్ట్ సైతం క్లాసిక్ గా నిలిచింది.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన జానర్ ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, బడ్జెట్ మాత్రం భారీగా ఉండే అవకాశం ఉంది. ఖర్చు విషయంలో ఎప్పుడూ ప్రణాళికాబద్ధంగా ఉండే రానా, ఈ ఇండో-ఇంగ్లీష్ మూవీకి ఎంత పెట్టుబడి పెట్టబోతున్నాడో చూడాలి. ప్రస్తుతం యాక్టింగ్ కన్నా ప్రొడక్షన్‌పై ఎక్కువ దృష్టి పెట్టిన రానా, గతంలో తేజ దర్శకత్వంలో రాక్షస రాజు అనే సినిమా ప్రకటించాడు. అయితే అది సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. చిన్నికృష్ణ కథతో ఓ సినిమా చేయొచ్చనే వార్తలున్నా, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. దీంతో రానా కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరుగుతోంది.
Recent Random Post:














