
సంక్రాంతి పండుగతో పాటు బాక్సాఫీస్ వద్ద అసలైన హీట్ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ స్టైల్ మేనరిజమ్స్, ఎనర్జీతో థియేటర్లను షేక్ చేస్తుంటే… ప్రేక్షకులు ఫుల్ జోష్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి తన ట్రేడ్‌మార్క్ కామెడీతో చిరంజీవిని పర్ఫెక్ట్‌గా ప్రజెంట్ చేయడంతో ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSG) సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను గట్టిగా ఆకట్టుకుంటోంది. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా సంపూర్ణ వినోదాన్ని అందిస్తోంది.
రిలీజ్ అయిన మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ నమోదు చేసిన ఈ మెగా ఎంటర్‌టైనర్, రెండో రోజూ అదే జోరును కొనసాగించింది. పండుగ సెలవులు ప్రారంభం కావడంతో అన్ని ఏరియాల్లో థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. సింగిల్ స్క్రీన్స్ మాత్రమే కాదు, మల్టీప్లెక్స్‌లలో కూడా టికెట్లకు డిమాండ్ పెరిగింది. బుక్‌మైషో వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో టికెట్లు దొరకడం కష్టంగా మారింది.
కలెక్షన్ల పరంగా చూస్తే MSG దూకుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి కొత్త రికార్డును సృష్టించిందని మేకర్స్ అధికారిక పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఒక ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదే సమయంలో అనిల్ రావిపూడి వరుసగా ఆరోసారి 100 కోట్ల క్లబ్‌లోకి చేరడం మరో విశేషం.
ఈ విజయంపై స్పందించిన అనిల్ రావిపూడి, సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తన కెరీర్‌లో ఈ సంక్రాంతి ఎంతో ప్రత్యేకమైందని, రెండు రోజుల్లోనే 120 కోట్లకు పైగా గ్రాస్ రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రేక్షకులను నవ్వించడమే తన లక్ష్యమని, చిరంజీవి గారిని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు.
సక్సెస్ మీట్‌లో ట్రోల్స్‌పై కూడా అనిల్ చాలా స్పోర్టివ్‌గా స్పందించారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే మీమ్స్‌ను తాను కూడా ఎంజాయ్ చేస్తానని, అయితే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల ఆదరణే తనకు నిజమైన అవార్డని చెప్పారు. ఇంకా పండుగ సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైన ఈ చిత్రం, లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. మెగాస్టార్ మ్యాజిక్‌కు అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ తోడవడంతో, ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అసలైన విన్నర్ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Recent Random Post:















