
తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు వస్తున్నాయి. అయితే, ఈ సినిమా జాబితాలో నటించే హీరోయిన్స్ సంఖ్య ఎక్కువగా ఉన్నా, వారిలో సక్సెస్‌ను నిలబెట్టుకునే వాళ్లు తక్కువే. కానీ ఈ పోటీలోనే తనదైన స్థానం సంపాదించుకున్న నటి నయనతార. ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు, కమర్షియల్ ప్రాజెక్టుల మధ్య సమతుల్యతను పాటిస్తూ దశాబ్దాలుగా తన క్రేజ్‌ను నిలుపుకుంటోంది.
తమిళనాట ‘లేడీ సూపర్‌స్టార్’గా గుర్తింపు తెచ్చుకున్న నయన్, తెలుగు పరిశ్రమలోనూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇటీవలే బాలీవుడ్ లో షారుక్ ఖాన్ సరసన ‘జవాన్’తో బీటౌన్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది.
తాజాగా నయనతార గురించి మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కే కొత్త సినిమాలో నయనతారను హీరోయిన్‌గా తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. గతంలో ‘సైరా’, ‘గాడ్ ఫాదర్’ చిత్రాల్లో చిరుతో స్క్రీన్ షేర్ చేసిన నయన్, మరోసారి మెగాస్టార్ సరసన కనిపించనుందా? అన్న ఆసక్తికర చర్చ మొదలైంది.
అయితే ఈ సినిమా కోసం నయనతార రూ.18 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు సమాచారం. కాంప్రమైజ్ చేయని ఆమె, ఇంత ఇస్తేనే చేస్తానని క్లారిటీ ఇచ్చిందట. అయినా ఆమె ఖచ్చితంగా బజ్ క్రియేట్ చేయగలదనే నమ్మకంతో మేకర్స్ చర్చలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే “సంక్రాంతికి వస్తున్నాం” వంటి హిట్‌తో 300 కోట్ల క్లబ్‌లో చేరిన అనిల్, ఇప్పుడు మెగాస్టార్‌తో మళ్లీ మ్యాజిక్ చేయగలడా? అనేది చూడాలి!
Recent Random Post:














