చిరు 158లో రుక్మిణి వసంత్ జోడీగా?

Share


మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో అధికారికంగా లాక్ అయిన సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత ఇద్దరూ మళ్లీ జట్టుకట్టడం విశేషం. ఈసారి బాబీ, చిరంజీవి మాస్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఒక కొత్త మాస్ ఎంటర్టైనర్‌ను రెడీ చేస్తున్నాడు. అయితే ఈసారి కేవలం మాస్ ఎలిమెంట్స్‌పైనే ఆధారపడకుండా, కథాపరంగా కూడా కొత్తదనాన్ని చూపించాలన్న దిశగా బాబీ చాలా గ్రౌండ్ వర్క్ చేశాడని సమాచారం. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో చిరంజీవి ఇమేజ్‌ను బాగా ఎలివేట్ చేసినా, కథలో కొత్తదనం లేకపోవడంతో కొంత విమర్శలు ఎదురయ్యాయి. అందుకే ఈసారి అలాంటి లోపాలకు తావు లేకుండా ప్లాన్ చేస్తున్నాడట బాబీ.

ఇక చిరంజీవి సినిమాల్లో హీరోయిన్ ఎంపిక విషయానికి వస్తే, అది ఎప్పుడూ ఒక ఛాలెంజ్‌లానే ఉంటుంది. ఇప్పుడు ఆయన వయసు దాదాపు 70కి చేరిన నేపథ్యంలో, సరిపడే హీరోయిన్‌ను ఎంపిక చేయడం అంత ఈజీ కాదు. అందుకే డైరెక్టర్లు తరచూ పలు భాషల్లో అన్వేషణ జరుపుతుంటారు. కానీ చిరంజీవి మాత్రం తన వయసుకు తగిన, స్క్రీన్‌పై నేచురల్‌గా కనిపించే నాయికలనే కోరుకుంటారు. తాను పోషించే పాత్రకు సూట్ అయ్యే నటీమణి అయితేనే ఒప్పుకుంటారట.

ఈసారి బాబీ కూడా చిరు అభిరుచిని దృష్టిలో పెట్టుకుని హీరోయిన్ హంట్‌లో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది. శ్రుతి హాసన్, అనుష్క వంటి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, తాజాగా కन्नడ బ్యూటీ రుక్మిణి వసంత్ పేరు హాట్ టాక్‌గా మారింది. చిరంజీవికి జోడీగా ఆమెను తీసుకునే అవకాశం బలంగా ఉందని ఇండస్ట్రీ టాక్. ఇటీవల విడుదలైన ‘కాంతార చాప్టర్ వన్’లో రుక్మిణి, రిషబ్ శెట్టి సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రిషబ్ వయసు 42 ఏళ్లు అయినా, వయోజనమైన లుక్‌తో కనిపించే ఆయనకు రుక్మిణి బాగా సెట్ అయ్యింది.

అలాగే ఇటీవల చిరంజీవి స్లిమ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆయన చాలా యంగ్‌గా — 40 ఏళ్ల వయస్కుడిలా కనిపిస్తున్నారన్న కామెంట్లు వస్తున్నాయి. ఈ లుక్ వల్ల యువ నాయికలు కూడా ఆయనకు సులభంగా మ్యాచ్ అవుతారనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంతోనే బాబీ, రుక్మిణి వసంత్ పేరుని సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే తేలనుంది.


Recent Random Post: