జగపతిబాబు జీ5 టాక్‌ షోకి నాగార్జున ఫస్ట్ గెస్ట్

Share


తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు మరో ప్రత్యేకమైన టాక్‌ షో రాబోతోంది. ఇప్పటివరకు బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌తో, రానా పలు టాక్‌ షోలతో వినోదం పంచగా, ఇప్పుడు సీనియర్ హీరో జగపతిబాబు కొత్తగా రంగంలోకి దిగుతున్నారు. “జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి” అనే టాక్‌ షోతో జీ5లో ఆగస్టు 15 నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రెండు రోజుల తర్వాత అంటే ఆగస్టు 17న ఈ షో జీ తెలుగు ఛానల్‌లో ప్రసారం కానుంది.

మొదటి ఎపిసోడ్‌కి గెస్ట్‌గా నాగార్జున రాగా, ప్రోమో ఇప్పటికే చక్కటి హంగామా క్రియేట్ చేసింది. తన స్నేహితుడిగా నాగార్జునను పరిచయం చేసిన జగపతిబాబు, టబు – రమ్యకృష్ణలో ఎవరు ఫేవరెట్‌ కో–స్టార్‌ అని అడగగా నాగార్జున చాకచక్యంగా సమాధానం తప్పించుకోవడం, అలాగే సౌందర్య – రమ్యకృష్ణలో ఎవరు ఫేవరెట్‌ అని నాగ్‌ అడగగా జగపతిబాబు కూడా అదే తరహాలో తప్పించుకోవడం ప్రోమోలో వినోదాన్ని పంచింది.

అక్కినేని వెంకట్‌తో సరదా చర్చ, “నాగార్జునలో మన్మధుడు ఎప్పుడు కనిపించాడు?” అనే ప్రశ్నకు వెంకట్‌ చెప్పిన ఫన్నీ సమాధానం ప్రేక్షకులను మరింత ఆసక్తి కలిగిస్తోంది. నాగార్జున కూలీ సినిమాలో విలన్‌గా నటించిన విషయంపై కూడా ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.

ఈ ఎపిసోడ్‌ ఓటీటీతో పాటు బుల్లితెరపై కూడా మంచి స్పందన పొందే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, నాగార్జున – జగపతిబాబు జోడీ తెరపై తెచ్చే స్నేహం, సరదా, కౌంటర్లతో ఆగస్టు 15న ప్రేక్షకులకు పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుంది.


Recent Random Post: