జపాన్‌లో ‘దేవర’ కలెక్షన్లు: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూపులు!

Share


జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో తొలిసారిగా, ప్రత్యేకంగా జపాన్ వెళ్లి ప్రమోట్ చేసిన ‘దేవర’ మార్చి 28న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమోషన్ కోసం ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ అక్కడి ప్రేక్షకులను సమీపించి, మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఫ్యాన్స్ మీట్స్ నిర్వహించి ప్రత్యేక అనుభవాలను పంచుకున్నారు. అయితే ‘దేవర’కు అక్కడి ప్రేక్షకుల నుండి స్పందన ఎలా ఉంటుందనే దాని మీద సినీ ప్రియులు ఆసక్తిగా ఉన్నారు.

ట్రేడ్ టాక్ ప్రకారం, ‘దేవర’ జపాన్ మార్కెట్‌లో ఓ మాదిరిగానే నడుస్తోందని సమాచారం. మొదటి రెండు రోజుల్లో దాదాపు 11 మిలియన్ యెన్లు (జపాన్ కరెన్సీ) వసూలు చేసినట్లు తెలుస్తోంది. అటు థియేటర్లకు 6200 మంది దాకా ప్రేక్షకులు వచ్చారు. అయితే, దీని లాంగ్ రన్‌లో వృద్ధి ఉంటేనే దీన్ని సక్సెస్‌గా పరిగణించవచ్చు. ఇప్పటివరకు జపాన్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాల్లో ‘RRR’ (2.42 బిలియన్ యెన్లు), ‘ముత్తు’ (405 మిలియన్ యెన్లు), ‘బాహుబలి 2’ (305 మిలియన్ యెన్లు) టాప్‌లో ఉన్నాయి. ఈ లిస్టులో ‘దేవర’ స్థానం ఎక్కడుంటుందనేది చూడాల్సిందే.

ప్రస్తుతం తారక్ సోషల్ మీడియా పోస్టుల ద్వారా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ, కలెక్షన్లు మరింత బలంగా ఉండాల్సిన అవసరం ఉందనేది నిజం. మరోవైపు, ‘దేవర 2’ పై అభిమానుల అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేలోగా ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా మారనున్నారు. ‘వార్ 2’ పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ సినిమా, ఆ తరువాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ ప్యాన్-ఇండియా మూవీ చేయనున్నాడు. ఇవన్నీ అయ్యేలోగా మరో రెండు మూడేళ్లు గడిచిపోతాయి. అప్పటివరకు ‘దేవర 2’ కోసం వెయిట్ చేయడం అభిమానుల ఉత్సాహాన్ని తగ్గించొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సినిమాపై ఎన్టీఆర్, చిత్రబృందం ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.


Recent Random Post: