
టాలీవుడ్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా కంటే పాన్ వరల్డ్ గా తమ ప్రచారాన్ని విస్తరించుకుంటున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాలు విదేశాల్లో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. జపాన్, థాయ్‌లాండ్, మలేషియా, రష్యా వంటి దేశాల్లో ఈ సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ హీరోలు విదేశాలలో కూడా పెరిగిన అభిమానంతో మరింత విశ్వవిఖ్యాతులుగా మారిపోయారు.
ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా ఈ ట్రెండ్ లో చేరబోతున్నారు. తెలుగు సినిమా సాధారణంగా అమెరికాలో విడుదలై అక్కడి తెలుగు అభిమానుల మద్దతు పొందుతుంటాయి. కానీ, ఈసారి నాని తన సినిమాను ప్రత్యేకంగా జపాన్ లో విడుదల చేయబోతున్నారు. “సరిపోదాం శనివారం” సినిమా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా జపాన్‌లో విడుదల చేయాలని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేయడం పెద్ద విశేషంగా మారింది, ఎందుకంటే ఇప్పటి వరకు నాని సినిమా జపాన్‌లో విడుదల కాలేదు.
ఈ చిత్రానికి జపాన్ ఆడియన్స్ నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుందోనని నాని మరియు సినిమా టీమ్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే, అలాగే ఎస్.జె. సూర్య నటన కూడా సినిమా హైలైట్ గా నిలిచింది. ఈ పాత్ర జపాన్ ఆడియన్స్‌తో బాగా కనెక్ట్ అయితే, సినిమా మరింత విజయవంతం కావచ్చు. “సరిపోదా శనివారం” చిత్రం డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించారు.
Recent Random Post:















