టాలీవుడ్ లో తిరిగి రజినీ మ్యాజిక్.. ఇక కుర్ర హీరోలకు పోటీ తప్పనిసరి..

సూపర్ స్టార్ రజినీకాంత్ పేరుకు తమిళ్ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులో ఆయనకు ఉన్న ఫాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఒకప్పుడు రజిని డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగు స్టార్ హీరోల మూవీలతో సమానంగా వసూలు రావట్లేవి. అయితే ఆ తర్వాత తెలుగులో రజని మార్కెట్ మెల్లగా తగ్గుతూ వచ్చింది. రజనీకాంత్ కొన్ని స్ట్రైట్ తెలుగు సినిమాల్లో కూడా నటించారు. ఆయన నటించిన అరుణాచలం, భాష,నరసింహా, చంద్రముఖి, శివాజీ, రోబో లాంటి సినిమాలు తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ అందుకున్నాయి.

ఒకప్పుడు రజినీకాంత్ సినిమా విడుదలవుతుంది అంటే తెలుగులో స్టార్ హీరోలు కూడా పోటీగా సినిమా విడుదల చేయడానికి భయపడేవారు. అలాంటి రజనీకాంత్ మార్కెట్ గత కొద్ది కాలంగా బాగా దెబ్బతినింది. పేట, దర్బార్, పెద్దన్నలాంటి వరుస డిజాస్టర్ తో రజిని సినిమాలకు టాలీవుడ్ లో క్రేజ్ బాగా పడిపోయింది. ఇలాంటి సమయంలో జైలర్ అంటూ రజిని తిరిగి తన సత్తా చాటుకున్నారు. దీంతో రజినీకాంత్ సినిమాలకు ఒక్కసారిగా సూపర్ క్రేజ్ తిరిగి సంతరించుకుంది.

50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి జైలర్ మూవీ తెలుగులో రజనీకి పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఆ తర్వాత రజిని ప్రత్యేకమైన అతిథి పాత్ర పోషించిన లాల్ సలాం చిత్రం నిరాశపరిచింది. కానీ ఇప్పుడు ‘వేట్టయాన్’అని సరికొత్త మూవీ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రజనీ సిద్ధమవుతున్నారు. ఈ మూవీ కోసం ఈ వయసులో రజిని కష్టపడి చేసిన మేక్ ఓవర్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఏ మూవీ దర్శకత్వ బాధ్యతలు జ్ఞానవేల్ నిర్వహిస్తున్నారు.

విడుదలకు రెండు నెలల ముందే థియేట్రికల్ రైట్ అమ్ముడైపోయాయి అంటే ఈ మూవీ క్రేజ్ ఏ లెవెల్ లో ఉందో అర్థమైపోతుంది. తెలుగులో ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను ఏషియన్ మూవీ సంస్థ 15 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ కూడా తెలుగులో భారీ కలెక్షన్స్ అందుకుంటే ముందు ముందు టాలీవుడ్ స్టార్ హీరోలకు రజిని సినిమాలు గట్టి పోటీ ఇవ్వడం కన్ఫామ్ అంటున్నారు ట్రేడ్ పండితులు.


Recent Random Post: