
ఒకప్పుడు టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్‌గా గుర్తింపు పొందిన పూజా హెగ్డే… అల వైకుంఠపురములో, అరవింద సమేత వంటి బ్లాక్‌బస్టర్లతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అయితే ఇటీవల మాత్రం ఆమె కెరీర్‌లో అంతంతమాత్రంగానే కొనసాగుతోంది. వరుస ఫ్లాపులతో ఈ బుట్టబొమ్మ కొంత వెనుకబడినట్టు కనిపిస్తోంది. తాజాగా సూర్య హీరోగా నటించిన “రెట్రో” సినిమాపై ఎంతో ఆశలు పెట్టుకున్నప్పటికీ, అది కూడా డిజాస్టర్‌గా మిగిలింది.
చిరంజీవి ‘ఆచార్య’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ నుంచి మొదలుకుని తాజాగా వచ్చిన సినిమాల దాకా పూజ నటించినవన్నీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, ఆమెను కొత్త అవకాశాల కోసం ఎదురుచూడే పరిస్థితిలోకి తీసుకొచ్చింది.
అయితే, ఈ తరుణంలో పూజా హెగ్డే పెట్టిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్‌తో కలిసి చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురములో’ అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతకంటే ముందే, వీరిద్దరూ కలిసి నటించిన ‘డీజే’ సినిమాతో మంచి హిట్ కొట్టారు. తాజాగా, డీజే సినిమా దర్శకుడు హరీష్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను పూజ తన స్టోరీస్‌లో షేర్ చేస్తూ, “మళ్లీ DJ రీయూనియన్ కి ఛాన్స్ ఉందా? అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నావు?” అంటూ బన్నీని ట్యాగ్ చేసింది.
ఈ పోస్ట్ చూసిన వెంటనే అల్లు అర్జున్ “నెక్స్ట్ టైమ్ తప్పకుండా” అని సరదాగా రిప్లై ఇవ్వగా, ఫ్యాన్స్ మాత్రం ‘DJ 2 వస్తుందా?’ అంటూ ఉత్సాహంగా కామెంట్లు చేస్తున్నారు. దీనిపై హరీష్ శంకర్ నుంచి స్పందన రావలసి ఉంది కానీ, ప్రస్తుతం పూజ – బన్నీ మధ్య ఈ రీల్ ఇంటరాక్షన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Recent Random Post:














