
తమిళ సినీ ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ కలిగిన స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘రాయన్’ సినిమా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే ‘సార్’, ‘తిరుచిత్రాంబళం’ వంటి చిత్రాలు సైతం వంద కోట్ల క్లబ్లో చేరాయి. పాజిటివ్ టాక్ వచ్చిన ధనుష్ సినిమాలు తమిళనాట మంచి కలెక్షన్లు సాధించడం కామన్ విషయమే.
అయితే, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుబేర’ మాత్రం ఈ ట్రెండ్‌కు భిన్నంగా నిలిచింది. ధనుష్ లీడ్ రోల్లో, అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ సినిమా తమిళనాట ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్‌గా సాగాయి.
విడుదల తర్వాత పాజిటివ్ టాక్ వచ్చిందని, అదే సినిమాను నిలబెడుతుందని భావించారు. నిజంగా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, రివ్యూలు బాగున్నాయి. ధనుష్ కెరీర్లో బెస్ట్ సినిమాల్లో ఇది ఒకటిగా కొందరు విమర్శకులు ప్రశంసించారు. తొలి రోజు వసూళ్లు కూడా ఓ మోతాదులో నిలిచాయి. కానీ వీకెండ్‌కు మించి అది స్థిరంగా కొనసాగలేదు. ఇప్పటి వరకు మొత్తం కలెక్షన్లు రూ.20 కోట్లకు చేరువలో ఉన్నాయి. ఫుల్ రన్లో రూ.25 కోట్లకు మించి రాబట్టే ఛాన్స్ కాస్త కష్టంగానే కనిపిస్తోంది.
తమిళంలో ఈ సినిమా బిజినెస్ కూడా పెద్దగా జరగలేదు. కేవలం రూ.18 కోట్లకు హక్కులు అమ్మారు. ప్రస్తుత వసూళ్లను చూస్తే, డిస్ట్రిబ్యూటర్లకు 40-50 శాతం వరకూ నష్టాలు రావొచ్చన్న అంచనా వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందిస్తూ, తమిళంలో సినిమా ఫెయిలవడం తానూ ఊహించలేదని చెప్పాడు. తెలుగులో మంచి వసూళ్లు సాధించిన చిత్రం, తమిళంలో మళ్ళీ ఎందుకు చప్పగా ఆడిందో తనకు అర్థం కావడం లేదని అన్నాడు. “కుబేర కథ, ధనుష్ పాత్ర అన్నీ తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గవే. అలాంటపుడు వసూళ్లు ఎందుకు రావట్లేదో.. తప్పు ఎక్కడ జరిగిందో కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాం” అని అన్నారు.
Recent Random Post:














