

అక్కినేని యువ వారసుడు అఖిల్ ఇటీవలే ముంబయికి చెందిన జైనబ్ రవ్జీని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం నిశ్చితార్థం అనంతరం ఇరు కుటుంబాలు ఒక సంవత్సరం పాటు వేచి చూశాయి. ఈ గ్యాప్‌లో అఖిల్-జైనబ్ బంధం మరింత బలపడింది. తాజాగా పెళ్లి ఘనంగా జరగడంతో అఖిల్ కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యాడు.
ప్రస్తుతం అఖిల్ హైదరాబాద్‌లోనే ఉన్నా, హనీమూన్ కి ఎక్కడికి వెళ్లనున్నారన్నది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఇదిలా ఉండగా, అఖిల్ నటిస్తున్న తాజా సినిమా ‘లెనిన్’ తదుపరి షెడ్యూల్ తిరుపతిలో మొదలుకానుందని సమాచారం. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తయింది.
విదేశాల్లో షూట్ లేకుండా, రియలిస్టిక్ లొకేషన్లను ఫాలో అవుతూ, అవసరమైన సెట్స్‌తో సినిమాను ముందుకు తీసుకువస్తున్నారు. అయితే ఇప్పుడు తిరుపతి ప్రాంతంలోని కొన్ని కీలక ప్రాంతాల్లో తదుపరి షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. తిరుపతి లొకేషన్లను మళ్లీ ఎంచుకోవడం కథ అవసరాల పరంగా కీలకమయ్యింది.
ఇప్పటికే వరుస అపజయాల అనంతరం అఖిల్‌కు ఈ సినిమా విజయం అత్యంత కీలకం. పెళ్లి తర్వాత మొదటి సినిమా కావడంతో కొంతమంది అభిమానులు “పెళ్లి సెంటిమెంట్” పని చేస్తుందేమో అని ఆశపడుతున్నారు. మళ్లీ లైన్లోకి రావాలంటే అఖిల్‌కు ఈసారి సక్సెస్ తప్పనిసరిగా మారింది.
Recent Random Post:















