
త్రివిక్రమ్ టాలీవుడ్లో జర్నీ ఎలా ప్రారంభించారంటే—ఆయన ముందుగా రైటర్‌గా తన స్థానాన్ని సంపాదించుకున్నారు. అద్భుతమైన డైలాగులు, హృదయాన్ని తాకే భావోద్వేగాలు, ప్రత్యేకమైన స్క్రీన్‌ప్లే స్టైల్‌తో ప్రేక్షకుల మన్ననలు పొందారు. స్వయం వరంతో స్టోరీ రైటర్‌గా పరిచయమైన ఆయన, కొన్నేళ్లకే నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. రైటింగ్‌ను ఆపకుండా, దర్శకుడిగా వచ్చిన అవకాశాలను కూడా సమర్థంగా వినియోగించారు.
త్రివిక్రమ్ ఇప్పటివరకు 20 ఏళ్ల కెరీర్లో కేవలం 13 సినిమాలే తెరకెక్కించడం విశేషమే. తొలి చిత్రం నువ్వే నువ్వే మంచి విజయాన్ని అందించగా, వెంటనే మహేష్‌తో చేసిన అతడు భారీ క్రేజ్‌ను తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్‌తో చేసిన జల్సా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ విజయాల ప్రభావంతో మహేష్ ఖలేజా చేశారు కానీ అది డిజాస్టర్‌గా మారింది. రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత బన్నీతో చేసిన జులాయి హిట్ అయ్యింది. పవన్‌తో రెండోసారి చేసిన అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి, పవన్ కెరీర్లో ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బన్నీతో చేసిన సన్నాఫ్ సత్యమూర్తి యావరేజ్‌గా నిలిచింది. నితిన్‌తో చేసిన అ.. ఆ కూడా యావరేజ్ హిట్ సాధించింది.
తర్వాత వచ్చిన అజ్ఞాతవాసి మాత్రం భారీ ప్లాప్‌గా మారింది. అదే ఏడాది ఎన్టీఆర్‌తో చేసిన అరవింద సమేత మంచి విజయాన్ని అందుకుంది. బన్నీతో చేసిన అల వైకుంఠపురములో బ్లాక్‌బస్టర్‌గా సరికొత్త సెన్సేషన్ సృష్టించింది. 14 ఏళ్ల తర్వాత మహేష్‌తో చేసిన గుంటూరు కారం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం వెంకటేష్‌తో ఆదర్శ కుటుంబ హౌస్ నెంబర్ 47 చేస్తున్నారు.
త్రివిక్రమ్ సినిమాలు చాలా నెమ్మదిగా తీస్తారా అనే ప్రశ్న చాలామందిలో ఉంది. 20 ఏళ్ల కెరీర్లో 13 సినిమాలు మాత్రమే తెరకెక్కించడం చూస్తే ఆయన స్పీడ్ నిజంగానే స్లో అని చెప్పవచ్చు. తోటి దర్శకులు ఏడాదికి రెండు సినిమాలు చేస్తుంటే, గురూజీకి ఒక ఏడాదిలో ఒకదాన్ని పూర్తి చేయడం కూడా కష్టమే. ఇది స్టార్ హీరోలతో మాత్రమే పని చేయాలన్న కోరిక వల్లనా? లేక కథలపై ఆయన పెట్టే సమయం, పర్ఫెక్షన్ వల్లనా? అన్నది ఆయనే చెప్పగలరు.
Recent Random Post:















