థమన్ ఆలస్యం, నందమూరి అభిమానుల్లో నిరాశ

Share


బాలకృష్ణ, థమన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్‌ ఇంటిపేరు సైతం నందమూరిగానే మారిపోయిందని అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. బాలయ్య స్వయంగా ఆయనను “నా తమ్ముడు” అంటూ ఆదరించగా, థమన్‌ కూడా విశ్వసనీయతతో బాలయ్యకు అంకితభావంతో పనిచేస్తున్నాడు. బాలయ్యకు థమన్‌లో నచ్చిందేమిటంటే, ఆయన డౌన్‌ టూ ఎర్త్ నైజం. అందుకే ఆయనను తన ఇంటి మనిషిలా చూస్తున్నారు.

ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. తాజాగా సంక్రాంతికి విడుదలైన “డాకు మహారాజ్” కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ కూడా దుమ్ముదులిపింది. ఇక “అఖండ 2” విషయంలో థమన్‌ మ్యూజిక్‌ ఎలా ఉండబోతుందో ఊహించలేమని, అభిమానులను ముందే హెచ్చరించాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అయితే, ఇదే థమన్‌ ఇప్పుడు నందమూరి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు. “డాకు మహారాజ్” ఒరిజినల్‌ సౌండ్‌ట్రాక్‌ ఫిబ్రవరి 7న విడుదల చేస్తామని ప్రకటించాడు. ఈ తేదీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఆ తేదీకి ఎలాంటి విడుదల జరగలేదు. ఆ తర్వాత ఫిబ్రవరి 13న విడుదల చేస్తామన్నారు. అయితే, ఈసారి కూడా మాట నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పటికి 18వ తేదీ వచ్చేసినా, ఓఎస్‌టీ రిలీజ్‌పై ఎటువంటి అప్‌డేట్ లేదు.

అంతేకాదు, థమన్‌ ఈ ఆల్బమ్‌తో పాటు “సర్కారురా” అనే ప్రత్యేక పాటను కూడా విడుదల చేస్తామని చెప్పాడు. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఫ్యాన్స్‌ ఈ ఆలస్యం గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రతీసారి అభిమానుల ఉత్కంఠపై నీళ్లు చల్లడం మానేయాలని, ఓఎస్‌టీని త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Recent Random Post: