ది రాజా సాబ్ – ఒక ఆగిపోయిన యాత్ర?

Share


ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ ఎంటర్‌టైనర్ ది రాజా సాబ్ గురించి ఇప్పుడు సినీ వర్గాల్లో ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ రిలీజ్ అనుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు దసరా లేదా దీపావళికి కూడా సినిమా రాదేమో అన్న టాక్ వినిపిస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం, సినిమా 2026 సంక్రాంతికి పోతుందనే చర్చలూ జరుగుతున్నాయి.

సినిమాకు సంబంధించి ఇంకా కొంత టాకీ పార్ట్, నాలుగు పాటల షూటింగ్ మిగిలి ఉన్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ మంచి డిలేలో ఉన్న ఈ ప్రాజెక్ట్ రిలీజ్ ఎప్పుడు జరుగుతుందన్నది అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. బడ్జెట్ ఇష్యూలు, ప్రభాస్ డేట్ లు, ఇతర ఆర్టిస్టుల కాల్‌షీట్లు, విఎఫెక్స్ పనుల ఆలస్యం వంటి అనేక కారణాల వల్ల షూటింగ్ ప్రాసెస్ నెమ్మదించిందన్నది ఇండస్ట్రీ టాక్.

ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇదే బ్యానర్ నుండి మిరాయ్ అనే మరో ప్రాజెక్ట్ ఇటీవలే ఆగస్ట్ 1 విడుదల తేదీని ఖరారు చేసుకోగా, ది రాజా సాబ్ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదంటే ఫ్యాన్స్ అసహనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు విడుదలైనది కాన్సెప్ట్ టీజర్, కొన్ని పోస్టర్లు మాత్రమే. ప్రమోషనల్ కంటెంట్ అసలు మోషన్‌లోకి రాలేదంటే, పోస్ట్పోన్ ఫ్యాక్టర్ ఎంత ముదిరిందో స్పష్టమవుతుంది.

ఇలా విడుదల ఆలస్యం వల్లే గతంలో గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లు వంటి భారీ సినిమాల హైప్ డీగ్రేడ్ అయిన సందర్భాలున్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి ది రాజా సాబ్ ఎదుర్కొంటుందేమో అనే ఆందోళన నెలకొంది.

అయితే, దాదాపు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కావడంతో, మేకర్స్ త్వరలో స్పష్టమైన అప్‌డేట్ ఇవ్వాలన్నది ఫ్యాన్స్ ఆకాంక్ష.


Recent Random Post: